Lok Sabha elections 2024: టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే | Lok Sabha elections 2024: West Bengal BJP MLA Mukut Mani Adhikari joins TMC | Sakshi
Sakshi News home page

Lok Sabha elections 2024: టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

Mar 8 2024 6:16 AM | Updated on Mar 8 2024 6:16 AM

Lok Sabha elections 2024: West Bengal BJP MLA Mukut Mani Adhikari joins TMC - Sakshi

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముకుట్‌ మణి అధికారి గురువారం అధికార టీఎంసీలో చేరారు. నడియా  జిల్లా రాణాఘాట్‌ దక్షిణ్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అధికారి గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ ర్యాలీలో సీఎం మమతా బెనర్జీతోపాటు పాల్గొన్నారు.

సిట్టింగ్‌ ఎంపీ జగన్నాథ్‌ సర్కారుకే మళ్లీ రాణాఘాట్‌ టిక్కెట్‌ ఇవ్వాలన్న బీజేపీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తితో పార్టీ మారారు. ప్రజల కోసమే పనిచేసే పార్టీ టీఎంసీ, అందుకే పార్టీలో చేరానని చెప్పారు. ముకుట్‌ మణి అధికారి తమ పార్టీలో చేరారని టీఎంసీ తెలిపింది. దీంతో, 2021లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక టీఎంసీలో చేరిన బీజేపీల సంఖ్య ఎనిమిదికి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement