లాక్​డౌన్​ను పొడిగించిన మరో రాష్ట్రం

 Lock Down Extended In Bihar Till June 8 - Sakshi

పట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను పాటిస్తున్నాయి.  దీని​ వలన గత కొన్ని రోజులుగా అనేక రాష్ట్రాలలో పాజిటివ్​ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను పొడిగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, బిహర్​ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​ జూన్​ 8 లాక్​ డౌన్​ను పొడిగిస్తున్నట్లు సోమవారం ట్విటర్​ వేదికగా ప్రకటించారు.

అయితే, కొన్ని సడలింపులను కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం, తప్పనిసరిగా అవసరంముండే షాపులను మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇతర దుకాణా సముదాయాలను మాత్రం రోజు విడిచి రోజు తెరుచుకోవాలని సూచించారు. కాగా, ఆదివారం మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో లాక్​డౌన్​ను పొడిగించాలనే డిమాండ్​ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కోవిడ్​ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ‘బాల సహయాత యోజన పథకం’ కింద నెలకు 1,500 రూపాయలు అందజేస్తామని సీఎం నితిష్​ కుమార్​  ప్రకటించారు. దీనితో పాటుగా వారికి ఉచిత పాఠశాల విద్యతో పాటు ఆర్థిక సహయం కూడా అందిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే ప్రధాని మోదీ ‘ పీఎం‌‌ కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ పథకం’ కింద అనాథ పిల్లలకు తోడ్పాటు అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  

చదవండి: ఏపీలో జూన్‌ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top