ఎల్ఐసీ పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్త!

LIC policyholders Beware of calls from fake agents - Sakshi

దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కాంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త రకాల స్కీమ్స్ అందిస్తుంది. ఎండోమెంట్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, హెల్త్ ప్లాన్స్, లైఫ్ ప్లాన్స్ ఇలా పలు రకాల పాలసీలు ప్రజల కోసం తీసుకొచ్చింది. అందుకే ప్రతి కుటుంభంలో ఒకరికైనా ఏదైనా ఒక ఎల్ఐసీ పాలసీ అందుబాటులో ఉంటుంది. దేశ వ్యాప్తంగా దీనికి లక్షల్లో ఖాతాదారులు ఉన్నారు. అందుకే వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. 

ఈ కరోనా కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే సైబర్ నేరగాళ్ల దృష్టి బ్యాంక్ ఖాతాదారుల నుంచి ఎల్ఐసీ పాలసీదారులపై పడింది. ఎల్ఐసీ పాలసీదారులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారు. అందుకే మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎల్ఐసీ పాలసీదారులను అప్రమత్తం చేస్తోంది. ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మధ్య కొందరు మోసగాళ్లు ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ & ఐఆర్‏డీఏఐ అధికారులమని ఫోన్ చేసి పాలసీలు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చని చెప్పి మోసం చేస్తారని వివరించింది. పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఎల్‌ఐసీ వెబ్ సైట్‌కు వెళ్లి వివరాలు చెక్ చేసుకోవాలని కోరింది.

చదవండి:

ప్రమాదంలో 10 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top