రెండేళ్ల బాలికని ఎత్తుకెళ్లిన చిరుత పులి | Leopard Carries Away Two Year Old Girl | Sakshi
Sakshi News home page

రెండేళ్ల బాలికని ఎత్తుకెళ్లిన చిరుత పులి

Nov 25 2026 11:53 AM | Updated on Nov 25 2026 11:53 AM

Leopard Carries Away Two Year Old Girl

చిరుత పులి చేతిలో మృతి చెందిన వేదిక గొండో

కొరాపుట్‌: రెండేళ్ల బాలికను చిరుత పులి ఎత్తుకెళ్లిన దారుణ ఘటన చోటు చేసుకుంది. నబరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితి నక్కిటి సిమర గ్రామ పంచాయతీ జొడియా పరా గ్రామంలో విష్టు గొండో కుమార్తె వేదిక గొండో (2) మృతి చెందింది. రాత్రి మూత్ర విసర్జనకి బాలిక బయటకు రాగా అకస్మాత్తుగా పులి దాడి చేసి పట్టుకు పోయింది.

 ఇది గమనించిన బాలిక నాన్నమ్మ పులి వెంట పరుగులెత్తినప్పటికీ ఫలితం లేక పోయింది. సమీప అడవిలోనికి పులి వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే గ్రామస్తులు అడవిలో గాలింపు చేపట్టారు. ఇది తెలిసి అటవీ శాఖ సిబ్బంది రంగం లోనికి దిగి డ్రోన్‌ కెమెరాలతో గాలించారు. సమీప చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అటవీ బృందాలు కూడా గాలింపులో పాల్గొన్నాయి. సమీప అటవీ ప్రాంతంలో బాలిక అవశేషాలు గిరిజనులు గుర్తించారు. ఈ ఘటనతో రాయగర్‌ ప్రాంతంలో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement