Lalu Prasad Yadav Health Condition Worsens, Being Shifted To AIIMS From RIMS - Sakshi
Sakshi News home page

Lalu Prasad Yadav Health: క్షీణించిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం! ఢిల్లీ ఎయిమ్స్‌కు..

Mar 22 2022 4:11 PM | Updated on Mar 22 2022 4:39 PM

Lalu Prasad Yadav Health Condition Worsens - Sakshi

ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం.

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్‌ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన్ను.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (RIMS) నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రియాటిన్‌ లెవల్‌ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్‌ చేసినట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ కామేశ్వర ప్రసాద్‌ వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు మార్చి 11వ తేదీన కొట్టేసింది. 73 ఏళ్ల లాలూకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ ఆంబులెన్స్‌లో లాలూను ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement