క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‍సభ సభ్యత్వం రద్దు..

Lakshadweep Mp Mohammad Faizal Disqualified From Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులో దోషిగా తేలి 10 ఏళ్లు జైలు శిక్షపడిన లక్ష‍్యద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. లోక్‌సభ సెక్రటేరియట్ ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

మహమ్మద్ ఫైజల్ ఎన్సీపీ ఎంపీ. 2009లో కాంగ్రెస్ నేత మహమ్మద్ సాలిపై కొంతమంది సమూహంతో వెళ్లి దాడి చేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫైజల్ సహా మొత్తం 32 మందిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది.

ఈ కేసులో ఫైజల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది సెషన్స్ కోర్టు. బుధవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఆయన కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్‌సభ రద్దు చేసింది.
చదవండి: మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు..

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top