అర్ధరాత్రి మాటువేసి.. మహిళా ఎస్‌ఐని టార్గెట్‌ చేసి..

Lady Sub Inspector Subhashree Nayak chased In Bhubaneswar - Sakshi

భువనేశ్వర్‌: మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో వెంబడించారు. విధులు నిర్వహించుకుని పోలీసు స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇలా జరిగింది. ఈ షాకింగ్‌ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. ఈ మేరకు భువనేశ్వర్‌లోని సహీద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌లోని మహిళా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ శుభశ్రీ నాయక్‌(36) సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా నగరంలోని రిజర్వ్‌ బ్యాంక్‌ సమీపంలో కొందరు దుండగులు ఆమెను వెంబడించారు. చేతిలో కత్తులు, తల్వార్లతో ఆమెను వారు ఫాలో చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ క్రమంలో వారిబారి నుంచి ఎస్‌ఐ శుభశ్రీ నాయక్‌ తప్పించుకున్నారు. అనంతరం, ఈ ఘటనపై భువనేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరోవైపు.. ఎస్‌ఐ శుభశ్రీ నాయక్‌కి డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరుంది. అంతేకాకుండా కరోనా సమయంలో కూడా ఎస్‌ఐ శుభశ్రీ పలువురికి సాయం అందించారు. లాక్‌డౌన్‌ సమయంలో అవసరం ఉన్నవారిని భోజనం అందించారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన హీరోలు కూడా ఆమెను అభినందించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top