పీటీఐ డైరెక్టర్‌గా ఆదిమూలం

L Adimoolam is New Director of PTI Board - Sakshi

వైస్‌ చైర్మన్‌గా కె.ఎన్‌.శాంత్‌కుమార్‌

న్యూఢిల్లీ: దినమలర్‌ పత్రిక పబ్లిషర్‌ ఎల్‌.ఆదిమూలం పీటీఐ వార్తా సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గురువారం జరిగిన పీటీఐ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పీటీఐ వైస్‌ చైర్మన్‌ కె.ఎన్‌.శాంత్‌కుమార్‌ మరోసారి ఆ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించింది.

ఆదిమూలం ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ అధ్యక్షునిగా, ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ఏబీసీ) ప్రత్యేక ఆహ్వానితునిగా కూడా చేశారు. శాంత్‌కుమార్‌ గతంలో ఏబీసీ చైర్మన్‌గా పనిచేశారు.   

చదవండి: (పెరిగిన గుండెపోటు కేసులు.. నాలుగేళ్లలో అక్కడ 80 వేలకుపైగా మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top