తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో మేము పాల్గొనం।

Kremlin Says Russia Wont Attend New Taliban Govts Inauguration - Sakshi

న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్‌ తాలిబన్లు ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని రష్యా అధికార ప్రతినిధి క్రెమ్లిన్‌ స్పష్టం చేశారు. అంతకుముందు తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు రష్యా సహకరిస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో క్రెమ్లిన్‌ ఖండించారు.  తాము తాలిబన్ల ప్రభుత్వ  ప్రారంభోత్సవంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పారు. (చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్‌)

అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవానికి చైనా, పాకిస్తాన్‌, రష్యాతో సహా అనేక దేశాలను ఆహానించినట్లు సమాచారం.  'తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటును గుర్తిచాలన్న ఉత్సుకతతో ఉంది. కానీ దశాబ్దాలుగా యుద్ధంతో అట్టుడుకుపోతున్న అఫ్గన్‌ ప్రజలు తమ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని వారు భావిస్తున్నారా ? ' అని భారతదేశంలోని రష్యన్ రాయబారి నికోలాయ్ కుడాషెవ్ సోమవారం సంశయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 11వ తేదీన తాలిబన్ల ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది.(చదవండి: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్‌!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top