కేరళ ప్రభుత్వంపై గవర్నర్‌ ఆరిఫ్ సంచలన వ్యాఖ్యలు

Kerala Governor Stunning Charge On Pinarayi Vijayan Government - Sakshi

తిరువనంతపురం: కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ ప్రభుత్వం.. అధికార సీపీఐ(ఎం) అనుంబంధ విద్యార్థి సంస్థ అయిన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(SFI), ఉగ్రవాద నిరోధక చట్టం(UAPA) కింద కేంద్ర హోంశాఖ నిషేధించిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌  ఇండియా( పీఎఫ్‌ఐ) మధ్య సంబంధాలు కొనిసాగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేరళ ప్రభుత్వం, గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ మద్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేరళ ప్రభుత్వం పగలు ఎస్‌ఎఫ్‌ఐ కోసం పనిచేస్తే రాత్రి నిషేధిత పీఎఫ్‌ఐ కోసం పని చేస్తుందని మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ-పీఎఫ్‌ఐ మధ్య అనుబంధం కొనసాగుతుందని తెలపడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని  తెలిపారు.

కేరళ ప్రజల నుంచి కూడా ఈ విషయాన్ని తాను విన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఖచ్చితమైన పేర్లును చెప్పలేనని..  కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలోని పలు కీలక అంశాలు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వంతో గవర్నర్‌కు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

‘క్రేంద దర్యాప్తు సంస్థలకు అన్ని విషయాలు తెలుసు. అరెస్ట్‌ చేసినవారిలో సుమారు సగం మంది పీఎఫ్‌ఐకి చెందినవారు ఉన్నారు. ఇది కేరళలో కొత్తకాదు. గతంలో కూడా దీనికి సంబంధించిన పలు ఆరోపణలు.. కేరళ అసెంబ్లీ కూడా చర్చకు వచ్చాయి. కేరళలో పీఎఫ్‌ఐని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’ అని గవర్నర్‌ అన్నారు.

గత నెలలో కొల్లం జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శింస్తూ గవర్నర్‌కు నిరసన తెలిపారు.  దీంతో గవర్నర్‌ తన కాన్వాయ్‌ దిగి రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్‌ కూర్చోని ఎస్‌ఎఫ్‌ఐ  నిరసనకారులను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో పలు ప్రభుత్వం కార్యక్రమల్లో కూడా కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, గవర్నర్‌  ఆరిఫ్‌ కనీసం పలకిరించుకోకుండా వార్తల్లో నిలుస్తున్నారు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top