కర్ణాటక ఎన్నికలు: బడా నిర్మాత కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు సీజ్‌!

Karnataka Polls: Bollywood Film Producer Boney Kapoor Belonging Silverwares Worth Rs 39 Lakh Seized - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కమీషన్‌ ఇప్పటికే ఎన్నికల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను కూడా ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు అధికారులు జరుపుతున్న తనిఖీల్లో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్‌ చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ మారింది. 

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దావంగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఓ  బీఎండబ్ల్యూ కారులో లక్షలు విలువైన వెండి వస్తువులను ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు బాక్సల్లో వెండి వస్తువులను ఉంచి ఐదు చెన్నై నుంచి ముంబయి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ కారులోని వ్యక్తులు సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉండగా.. వాటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉండచ్చని అధికారులు పేర్కొన్నారు.

డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో, కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. హరి సింగ్‌ను విచారించగా.. ఆ వస్తువులు బోనీ కపూర్‌ కుటుంబానికి చెందినవేనని చెప్పినట్లు సమాచారం. ఆ వస్తువులకు సరైన పత్రాలు చూపించని కారణంగానే వాటిని సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ వస్తువులు బోనీ కపూర్‌ కుటుంబానికి చెందినవేనా? కాదా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top