బంగారు నెక్లెస్‌ని మింగిన ఆవు.. యజమానికి తెలియడంతో..

Karnataka: Cow Swallows Gold Chain Weighing 20 Grams Owned Done Surgery - Sakshi

సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు చాలా మందికే ఉంటుంది. కొందరు కుక్కలను, పిల్లులను, మరి కొం‍దరు ఆవులను కూడా పెంచుకుంటారు. కాకపోతే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఒక్కోసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఓ కుటుంబం కాస్త ఏమరుపాటులో ఉండేసరికి ఆ ఇంట్లోని ఆవు గొలుసు మింగేసింది. దాన్ని ఆవు కడుపులోంచి బయటకు తీసేందుకు ఆ కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడ్డారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సిర్సీ తాలూకాలోని  హీపనహళ్లిలో నివసిస్తున్న శ్రీకాంత్ హెగ్డే ఇంట్లో ఒక ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి ముందురోజు గోవు పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఆవు, దూడకు స్నానం చేయించి పూజలు చేశారు. భారతదేశంలో ఆవును ఆ సమయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఆవులను పూల దండలతో అలంకరించడం మామూలే. హెడ్జ్ కుటుంబం సభ్యులు మాత్రం పూల దండలతో పాటు 20 గ్రాముల బంగారు గొలుసుతో కూడా దూడకి అలంకరించారు. వాటికి పూజ చేసిన అనంతరం పూల దండలతో పాటు గొలుసును తీసి పక్కన ఉంచారు. అంతవరకు బాగానే ఉంది.

కానీ కొద్దిసేపటి తర్వాత పూలు , ఆ బంగారు గొలుసు మాయమయ్యాయి. కుటుంబీకులు ఆ గొలుసు కోసం గోశాల మొత్తం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆ ఆవు గొలుసు మింగేసి ఉంటుందని కుటుంబసభ్యులకు భావించారు. అవు పేడ వేస్తే.. దానితో పాటు నెక్లెస్ కూడా వ‌స్తుందిలే అని అనుకున్నారు. అలా ఓ నెల రోజుల పాటు.. దాని పేడ‌ను రోజూ చెక్ చేస్తూ వ‌చ్చారు కానీ.. ఫ‌లితం మాత్రం శూన్యం. దీంతో ఆ ఆవును వెట‌ర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నెక్లెస్‌ను తీయ‌డం కోసం దానికి సర్జరీ చేయించి గొలుసుని బయటకు తీశారు. కాకపోతే 20 గ్రామలు ఉండాల్సి గొలుసు కాస్త 18 గ్రాములే బయటకు వచ్చింది. నెక్లెస్‌లోని ఒక చిన్న భాగం మాత్రం మిస్ అయినా.. చివరకి ఆ గొలుసు ఆవు కడుపులోంచి తీసినందుకు ఆ ఫ్యామిలీ మొత్తం ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం బాగున్నట్లు ఆ హెడ్జ్‌ కుటుంబం తెలిపింది.

చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్‌ చుక్‌ రైలు వచ్చేది ఎప్పుడో..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top