
బనశంకరి(బెంగళూరు): కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన హావేరి జిల్లా ప్రస్తుతం మద్రాస్ ఐ కండ్లకలక కేసుల్లోనూ మొదటిస్థానంలో నిలిచింది. 9901 మంది కండ్లకలక బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,506 కండ్లకలక కేసులు వెలుగు చూడగా బీదర్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో శివమొగ్గ ఉంది. కండ్లకలక బాధితులు హావేరి జిల్లా ఆసుపత్రిలో వేలాదిమంది చికిత్స తీసుకుంటున్నారు.కాగా ఇటీవల రైతుల ఆత్మహత్యల్లో కూడా భారీ చర్చకు దారితీసింది. రెండునెలల్లో 18 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
చదవండి: రూపాయికే ఇడ్లీ..ఆహా ఏమి రుచి