రామనగరపై మత్తు పడగ | - | Sakshi
Sakshi News home page

రామనగరపై మత్తు పడగ

Feb 27 2026 9:29 AM | Updated on Feb 27 2026 9:29 AM

రామనగ

రామనగరపై మత్తు పడగ

ఆగ్రహం
పుష్ప సోయగం

వేతనం పెంచాలి

దొడ్డబళ్లాపురం: బెంగళూరు, మైసూరు వంటి మహానగరాలే కాదు.. పట్టణాలలో కూడా మత్తు పదార్థాల డంపులు గుట్టు రట్టవుతున్నాయి. డ్రగ్స్‌ భూతం ఎంతగా వేళ్లూనుకుందో బయటపడుతోంది. బెంగళూరు దక్షిణ జిల్లాగా, అందమైన కొండకోనలు, సరస్సులు, రిసార్టులతో అలరారే రామనగర ప్రాంతంలోనూ మత్తు భూతం వ్యాపించింది. ఇక్కడ టూరిజం, పరిశ్రమలు పెరిగేకొద్దీ డ్రగ్స్‌ సమస్య అధికమైనట్లు స్థానిక సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఏడాదిలో రెట్టింపు కేసులు

మూడేళ్లలో 206 కేసుల్లో 235 మంది డ్రగ్స్‌ విక్రేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.55 కోట్ల విలువైన వివిధ రకాల మత్తు పదార్థాలు సీజ్‌ చేశారు. 2024 ఏడాదితో పోలిస్తే 2025లో ఎన్‌డీపీఎస్‌ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. 2024లో 48 కేజీల గంజాయి దొరికింది, 2025లో అది 73 కేజీలకు పెరిగింది. అలాగే కొకై న్‌, ఎండీఎంఏ వంటి శక్తివంతమైన మత్తు పదార్థాలు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అరైస్టెన వారిలో దాదాపు అందరూ యువకులే కావడం గమనార్హం.

ఆన్‌లైన్‌ ద్వారా వ్యాపారం

వాట్సాప్‌, ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదించి నిర్జన ప్రదేశాల్లో అందజేస్తుంటారు. డ్రగ్స్‌ వినియోగదారుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. పాఠశాలలు, కాలేజీల వద్ద అధికంగా అమ్ముతున్నట్లు, ధనవంతుల పిల్లలు, ఉద్యోగులు ఎక్కువగా కొంటారని నిందితులు చెప్పడం గమనార్హం. ప్రకృతి మనోహరమైన రామనగర నుంచి డ్రగ్స్‌ భూతాన్ని తరిమేయాలని జనం కోరుతున్నారు.

మాట్లాడుతున్న రోజా, చిత్రంలో రెడ్డిసంఘ నేతలు

ప్రకృతి అందాల సీమలో డ్రగ్స్‌ బెడద

మూడేళ్లలో 206 కేసుల నమోదు,

235 మంది అరెస్టు

విద్యార్థులకు కూడా డ్రగ్స్‌ విక్రయాలు

రామనగరపై మత్తు పడగ 1
1/6

రామనగరపై మత్తు పడగ

రామనగరపై మత్తు పడగ 2
2/6

రామనగరపై మత్తు పడగ

రామనగరపై మత్తు పడగ 3
3/6

రామనగరపై మత్తు పడగ

రామనగరపై మత్తు పడగ 4
4/6

రామనగరపై మత్తు పడగ

రామనగరపై మత్తు పడగ 5
5/6

రామనగరపై మత్తు పడగ

రామనగరపై మత్తు పడగ 6
6/6

రామనగరపై మత్తు పడగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement