తల్లి కళ్లెదుటే.. రౌడీ నరికివేత | - | Sakshi
Sakshi News home page

తల్లి కళ్లెదుటే.. రౌడీ నరికివేత

Feb 27 2026 9:29 AM | Updated on Feb 27 2026 9:29 AM

తల్లి

తల్లి కళ్లెదుటే.. రౌడీ నరికివేత

బనశంకరి: సిలికాన్‌ సిటీలో అనేక నేరాలతో సంబంధమున్న రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కొన్ని నెలల క్రితం జైలునుంచి విడుదలైన అతనిని తల్లి ఎదురుగా దుండగులు కత్తులు, కొడవళ్లతో దాడిచేసి హతమార్చారు. బుధవారం అర్ధరాత్రి సంపిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. డీజే.హళ్లి ఠాణాలో రౌడీషీటర్‌ జాబితాలో ఉన్న పవన్‌కుమార్‌ (28) హతుడు.

వివరాలు.. నగరంలో పవన్‌కుమార్‌ ప్రముఖ రౌడీషీటర్లలో ఒకరు. మూడేళ్ల క్రితం రౌడీషీటర్‌ కపిల్‌ హత్య కేసులో ఇతడు అరైస్టె, గత ఏడాది మే నెలలో విడుదలయ్యాడు. ఒకటిన్నర నెల క్రితం సొంతంగా బేకరీని ఆరంభించాడు. పవన్‌కుమార్‌ ధణిసంద్ర అమరజ్యోతి లేఔట్‌లో ఇంటి వద్దకు చేరుకుని ఇంటి గేటు తీస్తుండగా 3 బైకుల్లో ఆరుమంది దుండగులు హెల్మెట్లు ధరించి వచ్చారు. వెంటనే కత్తులు, కొడవళ్లతో అతన్ని నరకడంతో రక్తపుమడుగులో పడిపోయారు. అక్కడ ఉన్న తల్లి కోమల గట్టిగా ఆర్తనాదాలు చేయగా దుండగులు బైక్‌ల మీద వెళ్లిపోయారు.

నా ముందే చంపేశారు: తల్లి

హతుని తల్లి కోమల మాట్లాడుతూ బేకరీని మూసేసి ఇంటికి వస్తున్నానని ఫోన్‌లో చెప్పాడు, బైకులలో వెంబడించిన దుండగులు ఇంటి గేట్‌ ముందు నా కుమారున్ని దారుణంగా హత్యచేశారని విలపించింది. నేను కాపాడలేకపోయానని తెలిపింది. గతంలో పాత కక్షలతో ప్రేమ్‌ అనే వ్యక్తితో గొడవలు అయ్యాయి, కొన్నినెలలు వేరే ఊరిలో బంధువుల ఇంట్లో ఉంచాను, ఇటీవల బెంగళూరుకు వచ్చాడని తెలిపింది.

బెంగళూరు ధనిసంద్రలో అర్ధరాత్రి ఘటన

ఆ హత్య మాదిరిగానే..

గతంలో రౌడీషీటర్‌ కపిల్‌ను దుండగులు ఇదేమాదిరి హత్య చేయడం గమనార్హం. ఘటనాస్థలాన్ని సంపిగేహళ్లి పోలీసులు పరిశీలించి కేసు నమోదుచేసుకుని హంతకుల కోసం గాలింపు చేపట్టారు. హత్యతో స్థానికంగా భయాందోళనలు అలముకొన్నాయి.

తల్లి కళ్లెదుటే.. రౌడీ నరికివేత 1
1/1

తల్లి కళ్లెదుటే.. రౌడీ నరికివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement