ఎంవీఏ ఓ రాక్షస కూటమి: కంగన | Kangana Ranaut slams Maha Vikas Aghadi | Sakshi
Sakshi News home page

ఎంవీఏ ఓ రాక్షస కూటమి: కంగన

Nov 25 2024 5:36 AM | Updated on Nov 25 2024 5:36 AM

Kangana Ranaut slams Maha Vikas Aghadi

న్యూఢిల్లీ/సిమ్లా/ముంబై: మహిళలను గౌరవించకపోవడం వల్లే మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ఓడిపోయిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ అన్నారు. ఆమె ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంవీఏను రాక్షస కూటమిగా అభివర్ణించారు. మహిళలను గౌరవించే వారు దేవతలుగా, గౌరవించనివాళ్లు రాక్షసులుగా మిగిలిపోతారన్నారు. 

2020లో అవిభాజ్య శివసేన నేతృత్వంలోని ఎంవీఏ సర్కారు ముంబైలోని కంగనా బంగ్లాను కూల్చేయడం తెలిసిందే. అప్పట్లో తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు. ‘‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారికి మహారాష్ట్ర ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు. అభివృద్ధికి, సుస్థిర ప్రభుత్వానికి ఓటేశారు’’ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement