జైన గురువు ‘సల్లేఖనం’ | Sakshi
Sakshi News home page

జైన గురువు ‘సల్లేఖనం’

Published Mon, Feb 19 2024 6:25 AM

Jain seer Acharya Vidyasagar Maharaj passes away - Sakshi

రాజ్‌నందన్‌గావ్‌: ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ ‘సల్లేఖన’ వ్రతం ద్వారా శరీరత్యాగం చేశారు. రాజ్‌నందన్‌గావ్‌ జిల్లా డొంగార్‌గఢ్‌లోని చంద్రగిరి తీర్థ్‌లో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస వదిలారని తీర్థ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆరు నెలలుగా మహారాజ్‌ దొంగార్‌గఢ్‌ తీర్థ్‌లోనే ఉంటున్నారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజులుగా సల్లేఖన దీక్షను పాటిస్తున్నారు. జైన మతాచారం ప్రకారం సంపూర్ణ ఉపవాస దీక్ష (సల్లేఖనం)తో శరీరం వదిలారు. ఆత్మ శుద్ధీకరణార్థం ఈ దీక్ష చేపట్టారు’’ అని తీర్థ్‌ తెలిపింది. తీర్థ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Advertisement
Advertisement