Whatsapp: వాట్సాప్‌పై కేంద్రం గరం గరం

IT Ministry directs WhatsApp to withdraw new privacy policy - Sakshi

న్యూఢిల్లీ: వాట్సాప్‌ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం గరం గరం అయ్యింది. నూతన ప్రైవసీ పాలసీలో చేపట్టిన మార్పులు భారతీయ పౌరుల గోప్యత, డేటా భద్రత, హక్కులు, ప్రయోజనాలకు హాని కలిగించేలా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వాట్సాప్ వెంటనే వివాదాస్పద కొత్త గోప్యతా విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

ఆ లోపు సంతృప్తికరమైన స్పందన రాకపోతే చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ డేటా ప్రకారం భారతదేశంలో 53 కోట్ల మంది వినియోగదారులను వాట్సాప్ కలిగి ఉంది. ఐరోపాలోని వినియోగదారులతో పోలిస్తే భారతీయ వినియోగదారుల పట్ల వాట్సాప్‌ అనుసరిస్తున్న వివక్ష ధోరణిని కేంద్రం ఖండిచింది. వాట్సాప్‌ తన కొత్త ప్రైవసీ పాలసీకి సంబందించిన మే15ను గడువును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అమలును వాయిదా వేసినంత మాత్రన ప్రజల ప్రయోజనాలను గుర్తించినట్లు కాదని ఐటీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. నూతన ప్రైవసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో కూడా మంత్రిత్వ శాఖ ఇదే వైఖరిని అవలభించింది.

చదవండి:

తరిగిపోతున్న ఎలాన్ మస్క్ సంపద

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top