అయోధ్య రూట్‌లో రైళ్లు రద్దు.. కారణమిదే! | Ayodhya Ram Mandir Inauguration: IRCTC Trains To Be Affected on Ayodhya Rail Route From Jan 16th To Jan 22nd - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్య రూట్‌లో రైళ్లు రద్దు.. కారణమిదే!

Published Tue, Jan 16 2024 11:42 AM

IRCTC Trains to be Affected on Ayodhya Rail Route - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్ (సింగిల్ ట్రాక్ డబ్లింగ్), విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో జనవరి 16 నుండి 22 వరకు అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.  అలాగే డూన్ ఎక్స్‌ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. 

నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రేఖా శర్మ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య కాంట్ నుండి ఆనంద్ విహార్ (ఢిల్లీ)కి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. అయితే ఈ రైలు రద్దును జనవరి 22 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్‌లల్లా పవిత్రోత్సవానికి జరుగున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అయోధ్య రైల్వే సెక్షన్‌లో ట్రాక్ డబ్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభోత్సవానికి ముందే హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జనవరి 22కు ముందుగానే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమవుతుందని యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. 

అయోధ్యలో రామ మందిరాన్ని ఈనెల 22న ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరగనుంది. రాజకీయ నేతలు మొదలుకొని, సినిమా, క్రీడా ప్రపంచానికి చెందిన పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 
ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి!

Advertisement
Advertisement