రైతులు, మహిళలకే పెద్దపీట

Interesting political On Madhya Pradesh Elections - Sakshi

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ రైతులు, మహిళలకే ప్రాధాన్యమిచ్చాయి. కాంగ్రెస్‌ అక్టోబర్‌ 17న, బీజేపీ తాజాగా 10వ తేదీన మేనిఫెస్టో విడుదల చేశాయి. 

రెండింట్లోనూ పలు అంశాలు ఒకేలా ఉండటం విశేషం... 

రైతులకు అలా
బీజేపీ:
► మద్దతు ధరను క్వింటాలుకు గోధు మకు రూ.2, 700, వరికి రూ.3,100 కు పెంచుతామని ప్రకటించింది. 
► అంతేగాక ఒక్కో రై తుకు రూ.12,000 ఆర్థికసాయంకూడా అందిస్తామంది. 

కాంగ్రెస్‌: 
► గోధుమకు రూ.2,600, వరికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించింది. 
► పంట రుణాలు మాఫీ చేస్తామని పేర్కొంది. 

మహిళలకు ఇలా... 
బీజేపీ: 
డ మహిళా సాధికారతపై బాగా దృష్టి పెట్టింది. లాడ్లీ బెహనా యోజన కింద ప్రతి పేద మహిళకు నెలకు రూ.1,250 ఇస్తోంది. 
► వారికి రూ.450కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించింది.      పేద కుటుంబాల బాలికలకు పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచి్చంది. 
► లాడ్లీ లక్ష్మి పథకం కింద ప్రయోజనాలను లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయలకు పెంచుతామంది. 

కాంగ్రెస్‌: 
► నారీ శక్తి సమ్మాన్‌ పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించింది. 
► రూ.500కు వంట గ్యాస్‌ అందిస్తామని పేర్కొంది. 
► లాడ్లీ లక్ష్మి పథకానికి పోటీగా మేరీ బేటీ లాడ్లీ పథకం కింద రూ.2.51 లక్షల మేరకు అందేలా చూస్తామని ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top