ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్‌ | Indian woman cadet onboard MSC Aries seized by Iran returns home | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్‌

Apr 19 2024 5:34 AM | Updated on Apr 19 2024 5:34 AM

Indian woman cadet onboard MSC Aries seized by Iran returns home - Sakshi

న్యూఢిల్లీ: ఇరాన్‌ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్‌సీ ఏరీస్‌లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్‌ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆన్‌ టెస్సా జోసెఫ్‌ను ఇరాన్‌ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్‌కు చేరుకున్నట్లు  విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది.

వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్‌లోని కుటుంబసభ్యులతో ఫోన్‌లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ నాలుగు రోజుల క్రితం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అమిర్‌ అబొల్లాహియన్‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్‌ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్‌ జలసంధిలో ఉన్న ఎంఎస్‌సీ ఏరీస్‌ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement