Monkeypox: దేశంలో మూడుకి చేరిన మంకీపాక్స్‌ కేసులు | India third case of monkeypox confirmed in Kerala | Sakshi
Sakshi News home page

మంకీపాక్స్‌ కేసులు సంఖ్య మూడుకి! తాజా కేసు ఎక్కడంటే..

Jul 23 2022 7:39 AM | Updated on Jul 23 2022 7:59 AM

India third case of monkeypox confirmed in Kerala - Sakshi

ఆఫ్రికన్‌ వైరస్‌ మంకీపాక్స్‌ భారత్‌లోనూ ప్రభావం చూపడం మొదలుపెట్టింది.

తిరువనంతపురం: దేశంలో మూడో మంకీపాక్స్‌ కేసు వెలుగు చూసింది. అదీ కేరళలోనే కావడం గమనార్హం. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ శుక్రవారం ధృవీకరించారు.

ఈ నెల మొదటివారంలో యూఏఈ నుంచి వచ్చిన ఓ వ్యక్తి(35) స్వస్థలం మల్లాపురానికి వచ్చాడు. అతనిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేసి.. ధృవీకరించారు వైద్యాధికారులు. దీంతో కేరళలోనే మూడు కేసులు వెలుగు చూసినట్లు అయ్యింది. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి స్థిమితంగానే ఉందని, ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోందని మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు.

కొల్లాం, కన్నూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. ఈ మధ్యే యూఏఈ, దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లోనూ ఇంతకు ముందు వైరస్‌ బయటపడింది. దేశంలోనే తొలి మంకీపాక్స్ కేసు అధికారికంగా కేరళలో బయటపడగా.. తాజాగా ఆ సంఖ్య మూడుకి చేరింది.

కేరళలో మరో వైరస్‌
వాయనాడ్‌ జిల్లా మనంతవాడిలో రెండు పందుల పెంపకం కేంద్రాల్లో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్ జాడ వెలుగు చూసింది. వ్యాధి సోకిన పందుల నుంచి నమునాలను భోపాల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీకి పంపారు అధికారులు. ఆపై 23 పందులకు ఫీవర్‌ సోకినట్లు నిర్ధారించుకుని.. వాటితో పాటు మొత్తం 300 పందుల్ని చంపేసి భూమిలో పాతిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement