దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు | India Reported 18,257 New Corona Cases | Sakshi
Sakshi News home page

రోజురోజుకు పెరుగుతున్న యాక్టివ్ కేసులు

Jul 10 2022 10:36 AM | Updated on Jul 10 2022 11:08 AM

India Reported 18,257 New Corona Cases - Sakshi

వైరస్ బారినపడినవారిలో 14,553 మంది కోలుకున్నారు. మరో 42 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 18,257 మందికి పాజిటివ్‌గా తెేలింది. వైరస్ బారినపడినవారిలో 14,553 మంది కోలుకున్నారు. మరో 42 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,22,651కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,428కి పెరిగింది.

దేశంలో ప్రస్తుతం 1,28,428(0.30 శాతం) యాక్టివ్ కేసులున్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.08శాతంగా నమోదైంది. కరోనా రికవరీ రేటు 98.50శాతంగా ఉంది. మరణాల రేటు 1.20శాతంగా నమోదైంది. 

మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.76 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మరో 4,32,777 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement