విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్‌ల కలకలం... హై అలర్ట్‌లో భారత్‌

India Remains High Alert Drones Spotted Over Kolkata Monument - Sakshi

న్యూఢిల్లీ: కోల్‌కతాలో స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకలకు ముందే ఇద్దరు బంగ్లదేశ్‌ పౌరులు విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్‌లు ఎగరువేశారు. దీంతో భారత్‌ హై కమాండ్‌ ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. భారీ కంటైనర్‌లలో పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సుమారు ఆరుగురు అనుమానితుల్ని అదపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....మీరట్‌ జైలులో ఉన్న అనిల్‌ గ్యాంగ్‌ స్టర్‌కి ఈ ఆపరేషన్‌లో ప్రమేయం ఉన్నట్లు చెబుత్నున్నారు.  ఈ మేరకు జౌన్‌పర్‌ నివాసి సద్దాం కోసం అనిల్‌ ఉత్తరాఖండ్‌లోని డెహ్రుడూన్‌లోని గన్‌హౌస్‌ నుంచి ఈ ఆయుధాల కంటైనర్‌లను సిద్ధం చేశాడని తెలిపారు. అంతేకాదు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఒకరు గన్‌హౌస్‌ యజమాని. దీన్ని ఉగ్రవాదుల కుట్రగా అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ మేరకు పోలీసులు ఆగస్టు 6న ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌తో సహా అనుమానస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు రెండు బరువైన బ్యాగులను తరలిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో తాము వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలతో కూడిన కంటైనర్‌లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను లక్నోకు సరఫరా చేయన్నుట్లు విచారణలో తేలిందని చెప్పారు.

అలాగే స్మారక చిహ్నంపై డ్రోన్‌లు ఎగరువేసిన బంగ్లాదేశ్‌ పౌరులు మహ్మద్ షిఫాత్, మహ్మద్ జిల్లూర్ రెహమాన్‌లుగా గుర్తించామని చెప్పారు. ఆ వ్యక్తులు స్మారక చిహ్నం పై డ్రోన్‌లు ఎగరు వేయడమే కాకుండా పరిసరాల్లో ఫోటోలు తీస్తుండటంతో సీఎస్‌ఎఫ్‌ పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనలతో భారత ప్రభుత్వం అప్రమత్తమై గట్టి బంధోబస్తు ఏర్పాటు చేసింది.

అదీగాక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశవ్యాప్తంగా గట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించడం తోపాటు, తనీఖీలు కూడా ముమ్మరం చేశారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్లతో సహా అన్ని ప్రజా సందోహం ఎక్కువగా ఉండే అ‍న్ని ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top