భారత్‌లో భారీగా కొత్త కేసులు... | India records highest single-day spike of 75,760 new coronavirus cases | Sakshi
Sakshi News home page

భారత్‌లో భారీగా కొత్త కేసులు...

Aug 28 2020 3:36 AM | Updated on Aug 28 2020 3:36 AM

India records highest single-day spike of 75,760 new coronavirus cases - Sakshi

దేశంలో 24 గంటల్లో భారీగా కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒకే రోజులో 75,760 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 33,10,234కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి ఇప్పటి వరకూ 25,23,771 మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 76.24గా ఉంది. అత్యధిక కేసులు కలిగిన రాష్ట్రాల జాబితాలో 7,18,711 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉన్న దేశాల్లో అత్యధిక కేసులు కలిగిన జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement