రాందేవ్‌ బాబా వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా

IMA Uttarakhand Defamation Notice To Ramdev Baba - Sakshi

డెహ్రడూన్‌: కరోనా వైరస్‌ను నియంత్రించడంతో అల్లోపతి వైద్యం విఫలం చెందిందని యోగా గురువు రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లోపతి వైద్యంపై నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై భారత వైద్య సంఘం (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌-ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి పరిహారంగా రూ.వెయ్యి కోట్లు డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అల్లోపతి వైద్యంపై రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా వేసింది. రూ.వెయ్యి చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్‌ విభాగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై రాందేవ్‌ బాబా క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేయకపోయినా.. 15 రోజుల్లో రాతపూర్వక క్షమాపణ చెప్పకపోయినా రాందేవ్‌ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ పరువు నష్టం దావా ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్థసింగ్‌ రావత్‌కు లేఖ రాసింది. రాందేవ్‌ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top