indian medical association
-
కోల్‌కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రద్దుచేసింది. ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ విభాగం ఇటీవల డబ్ల్యూబీఎంసీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న మెడికల్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.కాగా, ఈ కేసులో సీబీఐ అధికారులు నిన్న(బుధవారం) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ధరించిన దుస్తులను కోల్‌కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. హత్య జరిగిన రోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్‌హాల్‌లోకి నిందితుడు సంజయ్రాయ్ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్ ధరించిన దుస్తులను సీజ్ చేసేందుకు కోల్‌కతాలోని తాలా పోలీస్‌స్టేషన్ పోలీసులకు రెండు రోజులు పట్టింది.ఇదీ చదవండి: నిందితుడు సంజయ్‌ది పశు ప్రవృత్తిఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్ దుస్తులను సీజ్ చేసి ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, తాలా మాజీ సీఐ అభిజిత్ మండల్‌ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది. -
IMA: ‘న్యాయం కోర్టుకు వదిలేసి.. వెంటనే విధుల్లో చేరండి’
ఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు , వైద్య సిబ్బంది, మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమబెంగాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తిరిగి విధుల్లో చేరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.‘ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ ఘటన దేశంలో ఉన్న ప్రతిఒక్కరి మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను దేశం తన కుమార్తెగా భావించింది. అయితే మొత్తం మెడికల్ కమ్యూనిటీ సుప్రీంకోర్టుకు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. వెంటనే విధుల్లోకి చేరి.. వైద్యసేవలు ప్రారంభించండి. న్యాయం జరగటం గురించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వదిలేయండి. రోగుల సంరక్షణ, భద్రత వైద్య వృత్తి ప్రధాన విధి. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. డాక్టర్ల రక్షణ కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్లు తమను నమ్మాలని.. వైద్యం నిలిపివేయవద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు తెలియజేసింది’ అని లేఖలో పేర్కొంది.ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించి సాక్ష్యాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు, వైద్య సిబ్బందికి మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు భారీగా నిరసనలు చేపట్టారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సమ్మెలో డాక్టర్లు.. దేశవ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె ప్రారంభమైంది. యువ డాక్టర్ హత్యకు నిరసనగా ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఇందులో భాగంగా శనివారం(ఆగస్టు17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో అవుట్‌పేషెంట్(ఓపీ) సేవలు ఆగిపోయాయి. మళ్లీ ఆదివారం ఉదయం 6 గంటల తర్వాతే డాక్టర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నంలో నిలిచిపోయిన వైద్య సేవలుజూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్నిరసనలో పాల్గొననున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులువిశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం.. మద్దతు పలకనున్న అన్ని ప్రజా సంఘాలు..అనంతపురంలో వైద్యుల సమ్మె..కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలి అత్యాచారం, హత్య నిరసిస్తూ వైద్య సేవలు నిలిపివేసిన అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు. జీజీహెచ్‌లో అవుట్‌పేషెంట్ సేవల నిలిపివేత. విజయవాడలో ఆగిన ఓపీ సేవలుకోల్ కతాలో జూనియర్ డాక్టర్ దారుణహత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళనవిజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లునేడు ఓపీ సేవలు పూర్తిగా నిలుపుదలఅత్యవసర సేవలకు మినహాయింపుజూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్తిరుపతిలో డాక్టర్ల నిరసన రుయా హాస్పిటల్ వద్ద ఏపి జూడాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్అసోషియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసనబహిరంగ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్న జూడాలుతిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజి మెడికల్ విద్యార్థులు, జూడాలు ఆద్వర్యంలో నిరసనసీబీఐ దర్యాప్తు ముమ్మరంఆర్జీ కార్ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు జూనియర్ వైద్యులు, ఇతర సీనియర్ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలితోపాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టంచేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోతున్నామని చెప్పారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా, ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా, కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని పేర్కొంది. కోల్‌కతాలోని డాక్టర్ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. -
మెడికల్ బోర్డు చీఫ్‌పై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోషియేషన్(IMA) అధ్యక్షుడు డా. ఆర్వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది. భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో తాము అందిరికంటే ముందు ఉంటామని మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఇంటర్వ్యూలో అశోకన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమానుల్లా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పతంజలి నకిలీ ప్రకటనల కేసులో అశోకన్ పిటిషన్‌గా ఉన్నారని గుర్తుచేసింది.‘మీ (అశోకన్) నుంచి మరింత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు ఆశించాం.కోర్టు తీర్పుకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలా హఠాత్తుగా మారటానికి కారణం ఏంటీ?’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.ఈ విషయంలో సుప్రీం కోర్టుకు అశోకన్ క్షమాపణలు తెలియజేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణలను ఒకవేళ కోర్టు అంగీకరిస్తే.. మిమ్మల్ని కించపరిచారని కోర్టు ఆశ్రయించారు. అలాంటప్పుడు మీకు ఎలాంటి పరీక్ష పెట్టాలి?’ అని కోర్టు నిలదీసింది. క్షమాపణల అఫిడవిట్‌పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగంగా ఎందుకు క్షమాపణలు చెప్పలేదని ప్రశ్నించింది. ‘మీరు నిజంగా క్షమాపణలు చెప్పాలనుకుంటే మీ అఫిడవిట్‌ను ఎందుకు సరిదిద్దుకోలేదు? ఇంటర్వ్యూ అనంతరం మిమ్మల్ని మీరు ఏవింధంగా సరిదిద్దుకున్నారో చెప్పండి’అని ధర్మాసనం ప్రశ్నించింది.‘భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో మేము ముందుంటాము. కానీ స్వీయ నియంత్రణ ఉండాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు నియంత్రణ ఉన్నట్లు ఆ ఇంట ఇంటర్వ్యూలో మాకు కనిపించలేదు’అని జస్టిస్ హిమకోహ్లి అన్నారు. ‘న్యాయమూర్తులుగా మేము విమర్శలు ఎదుర్కొంటున్నా. మేము స్పందించము. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా అహం ఉండదు. మేము ఉన్నతస్థానంలో ఉన్నాం. మేము చర్యలు తీసుకోవడానికి అర్హులం. చాలా అరుదుగా మాత్రమే చర్యలు తీసుకుంటాం’అని జస్టిస్ అమానుల్లా అన్నారు. ‘మీరు ఇలాంటి వ్యాఖ్యలతో కోర్టు గురించి ఏమి చెప్పలేరు. ఇలాంటి వ్యాఖ్యలే మీపైనే చేస్తే ఏం చేసేవారు’అని కోర్టు ప్రశ్నించింది. అశోకన్ సమర్పించిన అఫిడవిట్‌ను చాలా చిన్న, ఆలస్యంతో కూడినదిగా కోర్టు పేర్కొంది.ఈ విషయంలో ఉరట కల్పించాలని అశోకన్ తరుఫు న్యాయవాది కోరగా జస్టిస్ కోహ్లి స్పందింస్తూ. మీరు ప్రతిదీ చెప్పడానికి లేదు. అశోకన్ ట్రాప్‌లో చిక్కుకున్నారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ కేసుపై విచారణను సుప్రీం కోర్టు జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. ఇక.. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ ఇప్పటికే రెండుసార్లు క్షమాపణలు తెలిపినా కోర్టు తిరస్కరించింది. -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్‌లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్‌లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్‌కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
ప్రైవేట్ వైద్యులు వర్సెస్ ప్రభుత్వ చట్టం
ప్రజలకు ఆరోగ్య హక్కును పరిపూర్ణంగా అందించేందుకంటూ రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టం (రైట్ టు హెల్త్) దుమారం రేపుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో రోగులు ముందుగా డబ్బులు చెల్లించకపోయినా ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు విధిగా చికిత్స చేసి తీరాలని చెబుతోంది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రైవేటు వైద్యులు మెరుపు సమ్మెలకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెలో లక్ష మంది ప్రైవేటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2,500 ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు రెండు వారాలుగా ఉధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దాంతో అత్యవసర పరిస్థితుల్లోనూ చికిత్స అందించే వైద్యుల్లేక రాష్ట్రంలో రోగులు అల్లాడుతున్నారు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని సీఎం గహ్లోత్ అంటున్నారు. 2018 ఎన్నికల హామీని నెరవేర్చామని చెబుతున్నారు. దేశంలో తొలిసారి రాజస్తానే ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్య మంత్రి ప్రసాద్ లాల్ మీనా గర్వంగా ప్రకటించారు. మరోవైపు ప్రైవేటు డాక్టర్ల వాదన కూడా విని, వారి ఆందోళనలను సీఎం తీర్చాలని కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ హితవు పలికారు. అలా ఈ చట్టం అధికార కాంగ్రెస్‌లోనూ అంతర్గత పోరుకు దారి తీయొచ్చంటున్నారు. ఏమిటీ చట్టం? ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనారోగ్యంతో అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు డాక్టర్లు వైద్యం నిరాకరించకూడదు. ముందుగా డబ్బులు చెల్లించకపోయినా చికిత్స అందించి తీరాలి. చికిత్స పూర్తయ్యాక రోగి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదాలు, పాము కాట్లు, గర్భిణుల ప్రసవంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన ఏ పరిస్థితులైనా ఎమర్జెన్సీ కిందకు వస్తాయి. వాటికి వైద్యం నిరాకరించే ఆస్పత్రి/వైద్యుడు తొలిసారి 10 వేలు జరిమానా చెల్లించాలి. ఆ తర్వాత 25 వేలు, అలా పెరుగుతూ పోతుంది. చట్టంలో స్పష్టత లేని విషయాలివే! ► ఎమర్జెన్సీ అంటే చట్టంలో సరిగ్గా వివరించలేదు. ఒక్కోసారి తలనొప్పి కూడా అత్యవసర పరిస్థితి కిందకు వచ్చి బ్రెయిన్ హెమరేజ్‌కి దారి తీయవచ్చు. ► ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? ► వైద్య పరీక్షలకయ్యే ఖర్చుల సంగతేమిటి? కడుపు నొప్పి, తలనొప్పితో వచ్చి పరీక్షలన్నీ చేశాక తీరా అది ఎమర్జెన్సీ కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా? ► బిల్లు పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం ఆ సొమ్ముల్ని తిరిగి చెల్లిస్తుంది? ప్రైవేటు ఆస్పత్రులు ఎన్నాళ్లు వేచి చూడాలి? ప్రైవేటు వైద్యుల నిరసనలెందుకు? ► ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని చేశారని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. వైద్యుల జీవించే హక్కును కాలదన్నేలా ఈ చట్టం ఉందని, ఎమర్జెన్సీ అంటూ రోగులు వస్తే వారి సమస్య ఎలాంటిదైనా చికిత్స తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన వల్ల ఇక కనీస విశ్రాంతి కూడా దొరకదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్పత్రులు తమ బాధ్యతను చాకచక్యంగా ప్రైవేటు ఆస్పత్రులపై నెట్టేస్తున్నాయన్న వాదనలున్నాయి. రోగులు బిల్లులు చెల్లించలేని పక్షంలో వాటిని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో చట్టంలో స్పష్టత లేదని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ చట్టం అమలు సరిగ్గా జరగకపోతే రోగులకు, డాక్టర్లకు మధ్య పరస్పరం అపనమ్మకం ఎక్కువైపోతుందని వైద్యుల్లో ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘‘దీన్ని ఆరోగ్య హక్కు చట్టం అని పిలుస్తున్నారు. కానీ ఇందులో రోగుల హక్కుల కంటే వైద్యుని బాధ్యతలే ఎక్కువ! దీన్ని బలవంతంగా రుద్దితే వైద్యులు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు’’అని జైపూర్‌కు చెందిన డాక్టర్ బ్రూనో అన్నారు. వైద్యులకు వేధింపులు తప్పవా? ► ప్రైవేటు క్లినిక్‌లో డాక్టర్ చికిత్స ఇవ్వడానికి నిరాకరిస్తే అతనిపై రోగి న్యాయపరమైన చర్యలకు దిగొచ్చు. చట్టంలోని ఈ నిబంధన వల్ల తాము వేధింపులకి గురి కాక తప్పదని, అధికార యంత్రాంగం జోక్యం పెరిగిపోయి తప్పుడు కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రైవేటు డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ‘‘ఎవరికైనా చిన్న ప్రైవేటు క్లినిక్ ఉంటే ఎమర్జెన్సీ కింద 24 గంటలు తెరిచి ఉంచడం కష్టం. వైద్యులకు వ్యక్తిగత జీవితం ఉండదా? రోగులు కేసు పెడితే దాన్ని సవాల్ చేసే అవకాశం వైద్యులకు లేకుండా చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల్ని వేధించేందుకే’’అని జైపూర్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అమిత్ యాదవ్ విమర్శించారు. ఉద్దేశం మంచిదే కానీ... ► రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న వైద్యులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు అందరికీ ఆరోగ్యం అందించాలనే ఆ చట్టం స్ఫూర్తికి తాము మద్దతుగానే నిలుస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా చట్టంలో ఎన్నో లొసుగులున్నాయని డాక్టర్ పార్థ శర్మ అన్నారు. వాటినన్నింటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే మంచి కంటే చెడే జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్డౌన్ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్ స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్‌లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు.. -
ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సాక్షి, కామారెడ్డి: తెలంగాణవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డిలో జిల్లాలో ఇండియన్ మెడికల్ అసొసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్‌ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్‌లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
ప్రభుకుమార్‌కు ‘నేషనల్ యంగ్ లీడర్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ చైర్మన్, ప్రముఖ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలిని ‘డాక్టర్ కేతన్ నేషనల్ యంగ్ లీడర్’ అవార్డు వరించింది. ప్రభుకుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఐఎంఏ ఈ అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో ఏఎంఏ హౌస్‌లో ఆదివారం ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి జాతీయ నేతలు, వైద్యరంగ ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారని అవార్డు నిర్వాహకుడు, ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్, ప్రధాన కార్యదర్శి జయేశ్ లేలే ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ప్రభుకుమార్ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అనేకమంది పేషెంట్ల కు వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా ప్రభుకుమార్ అనేకమంది మన్ననలు పొందారు. బంజారాహిల్స్ ఐఎంఏ ప్రెసిడెంట్, రాపా మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన.. వైద్య రత్న, వైద్య విభూషణ్, వైద్య శిరోమణి, బెస్ట్ డాక్టర్ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి అవార్డులతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. -
Andhra Pradesh: ఆరోగ్య సేవలు భేష్
డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ): దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలు భేషుగ్గా ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు జయలాల్ అన్నారు. విశాఖలోని అంకోశా గెస్ట్ హౌస్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యుడికి వైద్యం అందివ్వాలన్న మంచి ఉద్దేశంతో వాడవాడలా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించడం శుభపరిణామమన్నారు. సీఎం జగన్ వైద్య సేవల విషయంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నారని కొనియాడారు. కోవిడ్ సేవలందిస్తూ మృతి చెందిన హెల్త్ వర్కర్లకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద రూ.50 లక్షలు ఇన్సూరెన్స్ ప్రకటించినప్పటికీ అమలు కావడం లేదన్నారు. కోవిడ్ బారిన పడి మరణించిన వైద్యులను గుర్తించి.. వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వైద్య సేవలందించే క్రమంలో అనుకోకుండా రోగి మృత్యువాత పడితే.. వైద్యులు, ఆస్పత్రులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్యులకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హోమియోపతిని ఐఎంఏ వ్యతిరేకించడం లేదన్నారు. మిక్సోపతిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఐఎంఏ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేయిష్ లేలే, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
కరోనా సెకండ్ వేవ్: 624 మంది డాక్టర్లు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా జూన్ 2 వరకు 624 మంది వైద్యులు మృత్యువాత పడ్డారని ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎమ్ఏ) వెల్లడించింది. ఏపీలో 34 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు మృతి చెందారని తెలిపింది. ఈ మేరకు గురువారం సంబంధిత గణాంకాలను వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 109 మంది.. బిహార్‌లో 96 మంది, యూపీలో 79 మంది, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా 748 మంది మృతి చెందారని తెలిపింది. కాగా, దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ స్థిరంగా కొనసాగుతోంది. కేసుల నమోదు తగ్గకపోగా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గురువారం లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే రెండు వేలు అధికంగా నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,59,873 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా వాటిలో 1,34,154 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక మరణాలు 2,887 సంభవించాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈమేరకు కరోనా బులెటిన్‌ను కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. చదవండి : Coronavirus: టీకాకు భయపడి డ్రమ్ వెనుక దాక్కున్న మహిళ -
బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు
డెహ్రడూన్: కరోనా వైరస్‌ను నియంత్రించడంతో అల్లోపతి వైద్యం విఫలం చెందిందని యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లోపతి వైద్యంపై నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ అసోసియేషన్-ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి పరిహారంగా రూ.వెయ్యి కోట్లు డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా వేసింది. రూ.వెయ్యి చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై రాందేవ్ బాబా క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేయకపోయినా.. 15 రోజుల్లో రాతపూర్వక క్షమాపణ చెప్పకపోయినా రాందేవ్ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ పరువు నష్టం దావా ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్‌కు లేఖ రాసింది. రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు!
న్యూఢిల్లీ: అల్లోపతి ఓ పిచ్చిసైన్స్ అనే కామెంట్ల వీడియోతో దుమారం రేపిన రాందేవ్ బాబా.. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బన్సాల్ కరోనాతో చనిపోవడంతో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్‌కి జరిగిన కొవిడ్-19 ట్రీట్మెంట్లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యాభై ఏడేళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్మెంట్ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్ ట్రీట్మెంట్లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం’’ అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది రాజస్థాన్ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్ వేసినట్లయ్యింది. లక్ష కరోనిల్ బాబా రాందేవ్-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్ష పతాంజలి కరోనిల్ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించాడు. ఇందుకోసం సగం ఖర్చును పతాంజలి సంస్థ భరిస్తుందని, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు. हरियाणा में कोविड मरीजों के बीच एक लाख पतंजलि की कोरोनिल किट मुफ्त बांटी जाएंगी । कोरोनिल का आधा खर्च पतंजलि ने और आधा हरियाणा सरकार के कोविड राहत कोष ने वहन किया है। — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 24, 2021 -
ఆ రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా?
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్య విధానం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి భారీ విమర్శలు మూటగట్టుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన యోగా గురు రాందేవ్ బాబా సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) 25 ప్రశ్నలు సంధించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివాటికి శాశ్వత పరిష్కారం అల్లోపతి వద్ద ఉందా అంటూ ప్రారంభించారు. అల్లోపతికి కేవలం 200 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందన్నారు. థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఆస్తమా వంటి రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా అని ప్రశ్నించారు. కొలెస్టరాల్‌కు, మైగ్రేన్‌కు, అమ్నీసియాకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని చికిత్స ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెలో ఏర్పడే రంధ్రాలకు నొప్పి లేకుండా చికిత్స చేయగలరా అని అడిగారు. వయస్సును వెనక్కు మళ్లేలా చేసి హీమోగ్లోబిన్ను పెంచే చికిత్స ఉందా అన్నారు. అల్లోపతి అన్నింటికి సమాధానం ఇస్తే డాక్టర్లకు ఏ రోగమూ రాకూడదని అభిప్రాయపడ్డారు. -
సెకండ్ వేవ్‌లో 400 మందికి పైగా వైద్యులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కోవిడ్ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్‌లో కోవిడ్ సోకి 420 మందికిపైగా వైద్యులు కన్నుమూసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఒక్క వారంలోనే కరోనావైరస్ కారణంగా 270 మంది వైద్యులు మరణించినట్లు తెలిపింది. వీరిలో 100 మందికిపైగా ఢిల్లీకి చెందిన వారేనని పేర్కొంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం..కరోనా ఫస్ట్ వేవ్‌లో 748 మంది వైద్యులు మరణించారు. ఐఎంఎఫ్ దాదాపు 3.35 లక్షల మంది సభ్యుల సమాచారాన్ని మాత్రమే రికార్డు చేసి ఉంచుతుంది. అయితే దేశంలో 12 లక్షలకు పైగా వైద్యులు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,57,299 కరోనా కేసులు నమోదైనట్లు, 4,194 మంది ప్రాణాలు కోల్పోయిట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత నెల దేశరాజధాని ఢిల్లీ కరోనాతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ తరువాత అత్యధికంగా బీహార్‌లో 96 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, గుజరాత్లో 31 మంది, తెలంగాణలో 20 మంది, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో 16 మంది చొప్పున చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. (చదవండి: వైరల్: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్) -
ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్ కన్నుమూత
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్(62) కన్నుమూశారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స కోసం కె.కె.అగర్వాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. డాక్టర్ అగర్వాల్ హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు హెడ్‌గా పని చేసి.. కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించారు. ఆయన 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. pic.twitter.com/uy7JzOyGWK — Dr K K Aggarwal (@DrKKAggarwal) May 17, 2021 చదవండి: కరోనా: నేడు ప్రధాని మోదీ సమీక్ష -
దేశవ్యాప్త లాక్డౌన్ విధించండి: ఐఎంఏ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొంది. తాము కేంద్రానికి అందించిన సలహాలు, సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం అర్థమైందని వెల్లడించింది. రాత్రిపూట కర్ఫ్యూల వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ అస్తవ్యస్తంగా ఉందని, 18 ఏళ్లకు పైబడినవారికి ఎక్కడైనా వ్యాక్సిన్ అందుతోందా? అని నిలదీసింది. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ ప్రక్రియ లోపభూయిష్టమని విమర్శించింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే వ్యాక్సినేషన్ ముందుకు సాగడంలేదని ఆరోపించింది. కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇకనైనా మేల్కోవాలని, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని ఐఎంఏ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నం అవుతుందని, అంతేకాకుండా, కరోనా రోగులకు నిర్విరామంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కొంతమేర ఉపశమనం లభిస్తుందని ఐఎంఏ అభిప్రాయపడింది. #PMOIndia #NITIAayog #LargestVaccineDrive #IMAIndiaOrg IMA demands the health ministry wake up from its slumber and responds to mitigate the growing challenges of the pandemic. pic.twitter.com/7OxKgLhi9Q — Indian Medical Association (@IMAIndiaOrg) May 8, 2021 -
కొరొనిల్’ ప్రమోషన్‌పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ బాబా రూపొందించిన కరోనా మందు ‘కొరొనిల్’ ప్రమోషన్‌పై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ ఆర్గనైజేషన్- ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేని మందుపై ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించింది. రామ్‌దేవ్ బాబా మందుపై కేంద్ర మంత్రులు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. తప్పుడు, అశాస్త్రీయ మందును ప్రజల ముందుకు ఎలా తీసుకొస్తారని నిలదీసింది. కరోనాకు విరుగుడుగా పతాంజలి సంస్థ రూపొందించిన ‘కొరొనిల్’ మందును ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్ బాబా విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్ ఉందని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విటర్లో తెలిపింది. అయితే దీనిపై సోమవారం భారత వైద్యుల సంఘం స్పందించింది. కొరొనిల్ మందును తాము ఎలాంటి పరీక్షలు చేయలేదని భారత వైద్య సంఘం (ఐఎంఏ) తెలిపింది. తాము పరీక్షించని మందుకు ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా ఎలా గుర్తించినట్లు రామ్‌దేవ్ బాబా చెప్పుకుంటారని ఐఎంఏ ప్రశ్నించింది. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ముందు పచ్చి అబద్ధాలు రామ్‌దేవ్ బాబా చెప్పారని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రామ్‌దేవ్ బాబా చెప్పిన ప్రకటనపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పందించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించింది. కరోనాను ఏ సంప్రదాయక మందుకు తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని ఈ సందర్భంగా ఐఎంఏ స్పష్టం చేసింది. వైద్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీన్ని ఎలా సమర్ధిస్తారని మండిపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరించిన మందును ఒక వైద్యుడిగా ఉన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఎలా సమర్ధించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్ తీసుకొచ్చిన ఆ మందుకు అంత సామర్థ్యం ఉంటే రూ.32వేల కోట్లు ఖర్చు చేసి ఎందుకు వ్యాక్సినేషన్ చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఐఎంఏ డిమాండ్ చేసింది. అయితే రామ్‌దేవ్ బాబా గతేడాదే ఈ మందును తీసుకువచ్చారు. అయితే ఈ మందు కరోనా నివారణకు పనికి రాదని, కేవలం రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేసే మందుగా అమ్మాలని అప్పట్లో ఆయుశ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. The Indian Medical Association issues a strongly worded statement on the Patanjali shenanigans and calls it a shame on the behalf of the Health Minister. pic.twitter.com/0kAHBkycGI — Abhishek Baxi (@baxiabhishek) February 22, 2021 -
పీజీ ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు(సర్జరీలు) చేయొచ్చు. ఇందుకోసం వారు శిక్షణ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీజీ ఆయుర్వేద వైద్యులు చేయాల్సిన 39 సాధారణ శస్త్రచికిత్స పద్ధతులను ఐఐసీఎం తన జాబితాలో పేర్కొంది. ఇందులో 19 పద్ధతులు విధానాలు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవే ఉన్నాయి. ఇందుకోసం ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద మెడిసిన్)–2016 నిబంధనలను సైతం కేంద్రం సవరించింది. తమ గెజిట్ నోటిఫికేషన్‌పై విమర్శలు వస్తుండడంతో ఆయుష్ శాఖ సెక్రెటరీ వైద్య రాజేశ్ కొటెచా స్పందించారు. ఇందులో కొత్త నిర్ణయం ఏదీ లేదని, నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. పీజీ ఆయుర్వేద వైద్యులందరినీ సర్జరీలు చేయడానికి అనుమతించడం లేదన్నారు. కేవలం శల్య, శలక్య విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయుర్వేద సంస్థల్లో 20 ఏళ్లుగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని సీసీఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ వైద్యజయంత్ దేవ్‌పూజారి తెలిపారు. తమ నోటిఫికేషన్‌తో వాటికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందన్నారు. అది తిరోగమన చర్య: ఐఎంఏ సీసీఐఎం అనుమతిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తిరోగమన చర్య అని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆధునిక వైద్యానికి చెందిన శస్త్రచికిత్స పద్ధతులు కాకుండా పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా సొంత శస్త్రచికిత్స విధానాలను రూపొందించుకోవాలని ఐఐసీఎంకు ఐఎంఏ సూచించింది. భారతీయ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాలేజీల్లో ఆధునిక వైద్య శాస్త్ర వైద్యులను నియమించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వేర్వేరు వైద్య శాస్త్రాలను కలిపేయడం మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పింది. అది ముమ్మాటికీ తిరోగమని చర్య అంటూ ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది. -
కరోనాతో 500 మంది వైద్యులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కనీసం 500 మంది వైద్యులు కరోనా వైరస్ (కోవిడ్ -19) సోకి మరణించారని శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తెలిపింది. వీరిలో సగం మందికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. "కోవిడ్ -19 రోగులకు చికిత్స అందిస్తున్న 515 మంది వైద్యులు ఇప్పటి వరకు అమరవీరులయ్యారు. వీరందరూ అల్లోపతి డాక్టర్లు, వీటిని వివిధ ఐఎంఏ శాఖల ద్వారా గుర్తించాం. దీని కోసం దేశవ్యాప్తంగా 1,746 శాఖలు పనిచేస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది’ అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ అన్నారు. ఐఎంఏ డేటాబేస్ ప్రకారం, డాక్టర్ రోగి నిష్పత్తి 1: 194 గా ఉంది. మరణించిన వారిలో మెజారిటీ నంబర్(201) వైద్యులు 60 నుంచి 70 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. తరువాత 50 నుంచి 60 సంవత్సరాల వయస్సులో 171 మంది మరణించారు. 70 ఏళ్లు పైబడిన వారు 66 మంది ఉండగా, 59 మంది వైద్యులు 35 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. 18 మంది వైద్యులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఉన్నారు. విధి నిర్వహణలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలపడానికి తమ వద్ద తగినంత డేటా లేదని కేంద్రం తెలిపింది. ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, అందువల్ల కేంద్రం అటువంటి డేటా బేస్‌ను నిర్వహించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఇటీవల పార్లమెంటులో వెల్లడించిన సంగతి తెలిసిందే. కేవలం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీలో భాగంగా ఈ మహమ్మరి సమయంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రభుత్వ భీమా పథకం కింద పరిహారం చెల్లించే సంఖ్యను మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుంది అని ఆయన తెలిపారు. డేటాను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులకు 50 లక్షల బీమా ఉందని, దీన్ని మార్చి 2021 వరకు పొడిగించామని ఆయన తెలిపారు. అయితే కరోనా బారినపడి మృతి చెందిన వైద్యుల వివరాల విషయంలో కేంద్రం తన బాధ్యత లేదంటూ చేతులు ఎలా దులుపుకుంటుందని ఐఎంఏ డాక్టర్ శర్మ సూటిగా ప్రశ్నించారు. కోవిడ్ పరీక్ష నిర్వహించడానికి ఆధార్‌ను అడిగినప్పుడు ఆ డేటా కేంద్రం దగ్గర ఎందుకు ఉండదని నిలదీశారు. చదవండి: కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు -
వైద్యుల పట్ల దృక్పథం మారాలి
సాక్షి, హైదరాబాద్: వైద్యుల పట్ల ప్రజల దృ క్పథంలో మార్పు రావాలని, వారి సేవలు, ఇబ్బందులను ప్రజలు గుర్తించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. వైద్యులపై రోగుల బంధువులు దాడులకు పాల్పడుతుండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. వైద్యులకు రక్షణ కల్పించడంతో పాటు ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించడానికి కేంద్రం ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ స్ కాన్వొకేషన్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. వైద్యులు సమర్థవంతమైన సేవలు అందిస్తుండడంతో దేశంలో కరో నా మరణాల రేటు (సీఎఫ్ఆర్) చాలా తక్కు వగా ఉందన్నారు. కరోనా సోకిన వైద్యులు, వైద్య సిబ్బందిలో మరణాల రేటు 15 శాతం ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు రాజన్ శర్మ, సెక్రటరీ జనరల్ అశోకన్, ఐఎంఏ వైస్ చైర్మ న్ అష్రఫ్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మోంగా ప్రకటనతో ఐఎంఏకు సంబంధం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కోవిడ్-19 సామూహిక వ్యాప్తి దశకు చేరిందనే విషయంలో స్పష్టత కొరవడింది. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చైర్మన్ వీకే మోంగా ఆదివారం వెల్లడించారు. ఎవరికి ఎలా వైరస్ సోకుతున్నదనేది అంతుచిక్కట్లేదని ఆయన పేర్కొన్నారు. మోంగా ప్రకటనపై ఐఎంఏలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో గందరగోళం నెలకొంది. మోంగా ప్రకటనను ఐఎంఏ అధ్యక్షుడు, కార్యదర్శి ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మోంగా వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమని ఐఎంఏకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని నగరాలు, పట్టణాల్లోనే కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్నాయని ఐఎంఏ కార్యవర్గం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలో లేదని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40, 421 తాజా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వైరస్ బారినపడి ఒక్కరోజులోనే 681 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 3,90,000 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చదవండి : కరోనా @11 లక్షలు -
సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 పరిస్థితి తీవ్రంగా ఉందనీ, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలిపింది. ‘దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతం’అని ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ వీకే మోంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమన్నారు. (సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ) దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలు కాలేదంటూ కేంద్రం చెబుతున్న నేపథ్యంలో ఐఎంఏ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో కట్టడి చేసినా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మాటేమిటి? అని ఆయన అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సాయం తీసుకుని పరిస్థితిని నియంత్రించాలన్నారు. ‘వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధిని కట్టడి చేయడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, ఈ వ్యాధి సోకిన 70 శాతం మంది రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, రెండోది, మిగతా 30 శాతం మందికి రోగ నిరోధక శక్తిని కల్పించడం’అని డాక్టర్ మోంగా తెలిపారు. (కరోనా చికిత్సల్లో రోబో)