క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడవద్దని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఐఎంఏ హాల్ నుంచి మయూరీసెంటర్, వైరా రోడ్డు, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్
క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడవద్దని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఐఎంఏ హాల్ నుంచి మయూరీసెంటర్, వైరా రోడ్డు, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం వల్ల వారి కుటుం బాలు చిన్నాభిన్నం అవుతాయని అన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే దానిని మానుకుంటారని అన్నారు. ఆత్మహత్య అనేది ఒక సంక్లిష్టమైన, బాధాకరమైన చర్య అని అన్నారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు.
అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణా సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలాంటి అవగాహన ర్యాలీ లు, సదస్సులు, నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తొలుత ఈ ర్యాలీని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భానుప్రకాష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్, అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంస్థ జిల్లా అధ్యక్షులు సతీష్‌బాబు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. నాగమణి, ప్రసాద్‌రావు, మమత సంస్థల చైర్మన్ అజయ్‌కుమార్, వైద్యులు అజయ్‌కుమార్, డీఎస్పీ బాలకిషన్, నర్సింగ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.