అక్షయ్ కుమార్ కు లీగల్ నోటీసు | IMA to serve legal notice to makers of 'Gabbar is Back' | Sakshi
Sakshi News home page

అక్షయ్ కుమార్ కు లీగల్ నోటీసు

May 11 2015 4:59 PM | Updated on Sep 3 2017 1:51 AM

అక్షయ్ కుమార్ కు లీగల్ నోటీసు

అక్షయ్ కుమార్ కు లీగల్ నోటీసు

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి లీగల్ నోటీసు పంపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయించింది.

ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి లీగల్ నోటీసు పంపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయించింది. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో వైద్యవృత్తిని కించపరిచేలా చూపించారని, పవిత్రమైన వైద్య వృత్తిపై ప్రజలకు నమ్మకం పోయేలా సన్నివేశాలున్నాయని ఐఎంఏ తెలిపింది.

అక్షయ్, భన్సాలీకి మంగళవారం లీగలు నోటీసు ఇస్తామని ఐఎంఏ గౌరవ కార్యదర్శి డాక్టర్ కేకే అగర్వాల్ తెలిపారు. మెడికల్ ప్రొఫెషన్ దేవాలయం లాంటదని... రాజకీయాలు, పోలీసులు ఇతర వృత్తులకు భిన్నమైనదని పేర్కొన్నారు. ఇలాంటి వృత్తి గురించి సినిమాలో చూపించాలనుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. వైద్యవృత్తిని కించపరిచేలా ఉన్న దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా 'గబ్బర్' సినిమా చాలా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కితాబిచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement