కరోనా: ఇక్కడి పరిస్థితుల కారణంగా తక్కువ వ్యాప్తి | Corona Virus: There Is Less Spread Here Due to Our Weather Conditions | Sakshi
Sakshi News home page

కరోనా: ఇక్కడి పరిస్థితుల కారణంగా తక్కువ వ్యాప్తి

Mar 3 2020 8:26 PM | Updated on Mar 3 2020 8:33 PM

Corona Virus: There Is Less Spread Here Due to Our Weather Conditions - Sakshi

సాక్షి, విజయవాడ : కరోనా వైరస్‌పై(కోవిడ్‌ 19) అవగాహన కల్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. ఏపీలోని తిరుపతిలో వ్యాధి నిర్దారణ కేంద్రం ఉందని, కరోనా వైరస్ ఇప్పటివరకు వచ్చిన వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి కాదని తెలిపారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందన్నారు. కరోనా వ్యాధి కేవలం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అవుతుందని, బయట దేశాలలో ఉండి వచ్చిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
(కరోనా అలర్ట్‌: ‘మాస్కులకు ఆర్డర్లు ఇస్తే మంచిది’) 

కరోనా వైరస్ తో లక్ష మంది ప్రజలు బాధ పడుతున్నారని, ఇందులో 25 శాతం మంది చనిపోవడం జరిగిందన్నారు. ఇది అంటువ్యాధిగా నిర్దారణ చేయటంతో ఐఎంఏ తరుపున అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వయసులో పెద్ద వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దగ్గిన, తుమ్మిన చేతులు అడ్డుపెట్టుకోవటం.. మాస్క్ లు ధరించటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ జలుబు దగ్గు వల్ల ఇబ్బంది ఉండదని, ఒక వారం పదిరోజులు దగ్గు జలుబుతో బాధ పడుతున్న వారు బయట జన సమూహాలు ఉన్న ప్రదేశాలకి వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు. (క‌రోనాతో మరో వైద్యుడు మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement