డాక్టర్ల పదవీ విరమణ వయస్సు 62కు పెంచాలి | telangana government asks doctors retirement age for 62 | Sakshi
Sakshi News home page

డాక్టర్ల పదవీ విరమణ వయస్సు 62కు పెంచాలి

Oct 18 2016 11:58 PM | Updated on Sep 4 2017 5:36 PM

రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ సర్కారుకు విన్నవించింది.

- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి
- కేంద్రం 65 ఏళ్లకు పెంచినట్లు ప్రస్తావన

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ సర్కారుకు విన్నవించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సును 65కు పెంచినట్లు గుర్తు చేశారు.

అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే విరమణ వయస్సును పెంచినట్లు పేర్కొన్నారు. విరమణ వయస్సు పెంచడం వల్ల అనేకమంది యువ డాక్టర్లు ప్రభుత్వ సర్వీసులోకి రావడానికి ఆసక్తి కనబర్చుతారని ఐఎంఏ వివరించింది. అంతేగాక సీనియర్ వైద్యుల సేవలు కూడా మరింత వినియోగించుకోవడానికి వీలుపడుతుందని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement