నేడు పీహెచ్‌సీ వైద్యుల చలో విజయవాడ | Government doctors in Andhra Pradesh dharna in Vijayawada on September 17 | Sakshi
Sakshi News home page

నేడు పీహెచ్‌సీ వైద్యుల చలో విజయవాడ

Sep 17 2024 3:05 AM | Updated on Sep 17 2024 3:05 AM

Government doctors in Andhra Pradesh dharna in Vijayawada on September 17

సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ యూనస్‌మీర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చలకు ప్రభుత్వం పిలుస్తామని చెప్పడంతో సోమవారం వేచి చూసినట్లు తెలిపారు. 

ప్రభుత్వం నుంచి స్పందన లేకపో­వడంతో ముందు నిర్దేశించుకున్నట్లు మంగళవారం చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీ వైద్యులు విజయవాడలో ర్యాలీ నిర్వహించి ధర్నాచౌక్‌లో శాంతియుత నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో వైద్యసే­వలు అందించబోమని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement