Lockdown: కరోనా కొత్త వేరియంట్‌.. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా? ఇదిగో క్లారిటీ..

India Covid-19 No Lockdown Situation 95 Percent Vaccinated - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్‌డౌన్‌ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్‌ స్పష్టత ఇచ్చారు.

కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు.

అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృ‍ష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు.
చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top