
సాక్షి, చెన్నై: ఐఐటీ మద్రాస్‌కు పూర్వ విద్యార్థి డాక్టర్ పరశురామ్ బాల సుబ్రమణియన్ రూ.5 కోట్లు విరాళంగా అందజేశారు. ఆక్వామాప్ పరిశోధన కేంద్రానికి ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా మద్రాస్ ఐఐటీ ఆయన్ను విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. ఆక్వామాప్ పరివర్తనాత్మక నీటి నిర్వహణ, విధానాల పరిష్కారాల కోసం పనిచేస్తుంది.
ఈ కేంద్రం భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు(పీఎస్‌ఏ) కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2022లో డాక్టర్ పరశురామ్ బాలసుబ్రమణియన్, ఇతిహాస రీసెర్చ్ అండ్ డిజిటల్ అధ్యక్షుడు శ్రీకృష్ణన్ నారాయణన్ కలిసి ఆక్వా మాప్‌ను స్థాపించారు. పరశురామ్ ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రుడయ్యారు.