రంగంలోకి డీఎంకే కమిటీ | - | Sakshi
Sakshi News home page

రంగంలోకి డీఎంకే కమిటీ

Feb 22 2026 7:19 AM | Updated on Feb 22 2026 7:19 AM

రంగంల

రంగంలోకి డీఎంకే కమిటీ

● టీఆర్‌ బాలు నేతృత్వంలో ఏర్పాటు ● నేటి నుంచి పొత్తు కసరత్తులపై దృష్టి

సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే, బీజేపీ మెగా కూటమి కసరత్తులు వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు సీట్ల పందేరం మొదలు కాలేదు. అదే సమయంలో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, వీసీకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లీం లీగ్‌, మనిద నేయ మక్కల్‌ కట్చి, మక్కల్‌నీది మయ్యం, మనిద నేయ జననాయగ కట్చి, కొంగునాడు దేశీయ కట్చి, తదితర పార్టీలతో ఇప్పటికే డీఎంకే కూటమి కొనసాగుతూ వస్తోంది. ఈ కూటమిలోకి ప్రపథమంగా తాజాగా, ప్రేమలత విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే సైతం వచ్చి చేరింది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు, ప్రతినిధులు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను కలిసి తాము ఆశిస్తున్న స్థానాల సంఖ్య, నియోజకవర్గాల జాబితాను అందజేసి ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌ ముందు వరుసలో ఉంది. రెండున్నర నెలల క్రితమే జాబితాను అందజేసింది. అయితే టీఎన్‌సీసీ, ఏఐసీసీలోని కొందరు నేతల సంకీర్ణ పాలన, అధిక సీట్లు అంటూ చేస్తూ వచ్చిన దూకుడు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన డీఎంకే నాన్చుడు ధోరణి అనుసరించడం మొదలెట్టింది.

రంగంలోకి కమిటీ..

నాన్చుడు ధోరణిపై సైతం కాంగ్రెస్‌ వర్గాలు పెదవి విప్పుతూ వస్తున్న నేపథ్యంలో కూటమిలోకి డీఎండీకేను తీసుకు రావడంలో డీఎంకే సఫలీకృతం కావడం కొత్త చర్చకు దారి తీసింది. కాంగ్రెస్‌కు పొగ పెడుతారా? లేదా సీట్ల సంఖ్యలో భారీగా కోత పెడుతారా? అన్న చర్చ ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం సీఎం స్టాలిన్‌ వేర్వేరుగా జిల్లాల నేతలతో, ఇన్‌చార్జ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాలు నిర్వహించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజా సమాచారాలు, పట్టున్న స్థానాలు, గెలుపు ధీమాతో ఉన్న స్థానాల వివరాల గురించి సమీక్షించారు. ఈ సమీక్ష తదుపరి పొత్తు కసరత్తు, సీట్ల పందేరాల ప్రక్రియకు గాను కమిటీని నియమిస్తూ ప్రకటించారు. ఈ కమిటీకి పార్టీ కోశాధికారి టీఆర్‌ బాలు నేతృత్వం వహించనున్నారు. పార్టీ డిప్యూటీ ప్రధానకార్యదర్శులు కేఎన్‌ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ .రాజ, పార్టీ కార్యాలయ ముఖ్యనేత ఆర్‌ఎస్‌ భారతీ, సీనియర్‌నేతలు, మంత్రులు ఏవీ వేలు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వంలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆదివారం నుంచి పొత్తు కసరత్తులు, సీట్ల పందేరాలపై దృష్టి పెట్టనుంది. తొలుత అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ తదుపరి పూర్తిస్థాయి కార్యాచరణతో ముందుకెళ్లనున్నది. కాగా, ఆది నుంచి సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్నట్టుగా మైనారిటీ పార్టీగా ఉన్న ఇండియన్‌ యూనియన్‌ ముస్లీంలీగ్‌కు కూటమిలో తొలి చర్చను ముగించి సీట్లను పంపిణీ చేయడానికి డీఎంకే సన్నద్దమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పొత్తు, సీట్ల కసరత్తుల ప్రక్రియను వారం రోజులలో ముగించే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో డీఎంకే కమిటీతో చర్చల దిశగా కూటమిలోని పార్టీలు సైతం క మిటీలను రంగంలోకి దించే పనిలో పడ్డారు. ఎండీఎంకే నేత వైగో తన పార్టీకి చెందిన అర్జున రాజ్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీని ప్రకటించారు. ఈ పొత్తు కసరత్తు, సీట్ల పందేరాలు సజావుగా సాగేనా లేదా కొత్త చర్చలకు తెర లేపేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇందుకు కారణం గతకొంత కాలంగా టీఎన్‌సీసీ, ఏఐసీసీ నేతలు పలువురు డీఎంకేకు వ్యతిరేకంగా చేస్తూ వస్తున్న వాఖ్యల కారణంగా పరిగణించవచ్చు.

డీఎంకే కార్యాలయం

ఏవీ వేలు

టీఆర్‌బాలు

ఎంఆర్‌కే పన్నీరు సెల్వం

పొత్తులు, సీట్ల పంపకాలపై డీఎంకే దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. డీఎంకే కోశాధికారి టీఆర్‌ బాలు నేతృత్వంలో ఏడుగురు సీనియర్లతో కూడిన ఈ కమిటీ ఆదివారం నుంచి వారం రోజులలో పొత్తు, సీట్ల పందేరం ఈ ప్రక్రియను ముగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది.

రంగంలోకి డీఎంకే కమిటీ 1
1/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 2
2/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 3
3/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 4
4/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 5
5/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 6
6/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 7
7/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 8
8/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 9
9/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 10
10/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 11
11/12

రంగంలోకి డీఎంకే కమిటీ

రంగంలోకి డీఎంకే కమిటీ 12
12/12

రంగంలోకి డీఎంకే కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement