భార్యను దారుణంగా చంపిన భర్త..కారణమిదే..

Husband Cut Wifes Throat Over Social Media Issue - Sakshi

కోల్‌కతా : సోషల్‌ మీడియా ఆ దంపతుల జీవితాల్లో విషాదం నింపింది. భార్య సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం భర్తకు నచ్చలేదు. ఈ విషయమై రోజూ ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలోనే భర్త కూరగాయలు కోసే కత్తితో భార్య గొంతు కోసి చంపాడు. చంపిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని సౌత్‌ 24 పరగణాల జిల్లాలోని హరియాణాపూర్‌లో జరిగింది. 

ఈ దారుణమైన ఘటన గురించి ఆ దంపతుల మైనర్‌ కుమారుడు మీడియాతో మాట్లాడాడు. ‘మా అమ్మ, నాన్న పరిమల్‌, అపర్ణ బైద్య ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. నాన్న అమ్మ గొంతు కోస్తామని చాలాసార్లు బెదిరించాడు. హత్య జరిగిన రోజు నేను ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మ రక్తంతో కింద పడి ఉంది. వెంటనే పక్కింటివారికి విషయం చెప్పాను’ అని దంపతుల కుమారుడు తెలిపాడు. 

‘అపర్ణ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంపై పరిమల్‌ తరచూ గొడవ పడుతుండేవాడు. సోషల్‌ మీడియాలో అపర్ణకు కొందరు ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌ కూడా ఏర్పడ్డారు. ఈ కారణంతోనే పరిమల్‌ అపర్ణను చంపాడు. హత్య తర్వాత పరిమల్‌ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి గాలింపు జరుగుతోంది’ అని పోలీసులు తెలిపారు. 

ఇదీచదవండి..దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top