పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి | Sakshi
Sakshi News home page

ఢిల్లీ: పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి

Published Sun, May 26 2024 7:51 AM

Huge Fire At Delhi Childrens Hospital

ఢిల్లీ: ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఉత్తర ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసింది. బేబీ కేర్‌ ఆస్పత్రిలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు శిశువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు శిశువులను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

 

ఈ  ప్రమాదంలో మంటలు చెలరేగిన భవనం నుంచి 12 మంది పిల్లలను రెస్య్కూ చేసి  బయలకు తీసుకురాగా.. అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు. రెస్య్కూలో ఆపరేషన్‌ చేపట్టి ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను కాపాడారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement