రైతుల ర్యాలీ.. అమిత్‌ షా అత్యవసర సమాచారం

Highlevel Meeting By Home Ministry On Farmers Tractor Rally In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్‌ డే రోజున రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఘటనపై వెంటనే సమీక్షించేందుకు ఆ శాఖ మంత్రి అమిత్‌ షా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. హోంశాఖ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో రైతుల ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చర్చించనున్నారు. అలాగే ఎర్రకోటపై రైతు జెండాను ఎగరేయడంపై కూడా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా హింసాత్మక ఘటనలో ఓ రైతు మృతిచెందగా.. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసుల వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బారికేడ్లు, బస్సులు, కంటైనర్లను తోసుకుంటూ ఎర్రకోట వైపు దూసుకెళ్లారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేశారు. హింసాత్మక చర్యలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సర్వీసులను సైతం నిలుపుదల చేశారు. (ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top