డేరా బాబాకు ఎదురు దెబ్బ | Sakshi
Sakshi News home page

డేరా బాబాకు ఎదురు దెబ్బ.. ఇక నుంచి హైకోర్టు అనుమతి ఉండాల్సిందే

Published Thu, Feb 29 2024 6:40 PM

High Court Says No More Ram Rahim Parole Without Court Approval - Sakshi

ఇద్దరు మహిళల అత్యాచార కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రామ్‌ రహీమ్‌కు తరచుగా పెరోల్‌ ఇవ్వటంపై హర్యానా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి హైకోర్టు నుంచి కచ్చితమైన అనుమతి లేకుండా రామ్‌ రహీమ్‌కు ఎటువంటి పేరొల్‌ మంజూరు చేయకూడదని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 19న ఆయన పెరోల్‌ మంజూరు అయింది. ఇప్పటివరకు గడిచిన పది నెలల్లో ఇది ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి ఆయన పెరోల్‌ పొందారు.

తాజాగా ఆయన మరోసారి తనకు పెరోల్‌ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పంజాబ్‌, హర్యానా హైకోర్టు.. హర్యానా ప్రభుత్వం తీవ్ర అసహం వ్యక్తం చేసింది. గతంలో రమ్‌ రహీం వలే.. ఎంతమంది దోషులకు పెరోల్‌ ఇచ్చారో? ఎన్ని రోజులు ఇచ్చారో? ఎంత మందికి పెరోల్స్‌ ఆమోదం పొందాయో అనే పూర్తి వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఇప్పటికే రామ్‌ రహీం మూడు ముఖ్యమైన సందర్భాల్లో 91 రోజులు పెరోల్‌పై జైలు బయట వచ్చారు. 21 రోజులు నవంబర్‌లో, 30 రోజులో జూలైలో, 40 రోజులు గత జనవరిలో  తన పుట్టిన రోజు సందర్భంగా పెరోల్‌ పొందారు. ఇక..తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో రామ్‌ రహీంను 2017లో హర్యానాలోని పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అయినకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనకు తరచు పెరోల్‌ జారీ చేయటంలో రాజకీయ కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా రాష్ట్రంలో నిర్వమించు పలు ఎన్నికలు. ఎందుకుంటే రామ్‌ రహీం అభిమానులు, భక్తులు ఎక్కువగా మాల్వా సామాజిక వర్గానికి ఉన్నారు. అయితే  ఆ సామాజిక వర్గం ఓట్లు హర్యానాలో అసెంబ్లీ, పార్లమెంట్‌  ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ సమాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో 69 సీట్లలో  ప్రాబల్యం కలిగిఉంటారు.

ఈ నేపథ్యంలో రామ్ రహీంకు పెరోల్‌ వచ్చేలా చేసి.. తన అనుచరులు, భక్తులైన మాల్వా సామాజిక వర్గం ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 2022, ఫిబ్రవరిలో పంజాబ్‌ ఎన్నికల సయయంలో 21 రోజుల పెరోల్‌ పొందారు. అదే ఏడాది హర్యానా మున్సిపల్‌ ఎన్నికల వేళ జూన్‌లో కూడా 30 రోజుల పెరోల్‌ పొందారు. గత ఏడాది అక్టోబర్‌లో సైతం హర్యానాలోని అదమ్‌పూర్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయనకు 40 రోజులు పెరోల్‌ లభించింది.

Advertisement
Advertisement