ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్‌లో సంచలన ఆధారాలు | Facts Revealed in Rowdy Sheeter Srikanth Parole Episode | Sakshi
Sakshi News home page

ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్‌లో సంచలన ఆధారాలు

Aug 21 2025 10:09 PM | Updated on Aug 21 2025 10:09 PM

 Facts Revealed in Rowdy Sheeter Srikanth Parole Episode

విజయవాడ: ఖైదీ శ్రీకాంత్‌ పెరోల్‌ అంశానికి సంబంధించి సంచలన ఆధారాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి.  శ్రీకాంత్‌ పెరోల్‌లో హోం మంత్రి అనిత అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై  హోంమంత్రి అనిత సంతకాలు చేశారు. హోంమంత్రి అనిత ఎండార్స్‌మెంట్‌ పైనే  ఫైల్ కదిలింది. మే 16 న హోంమంత్రి అనిత ఫైల్‌పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో  హోంశాఖ ఫైల్‌ సిద్ధం చేసింది. 

అయితే ఖైదీ శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వొద్దని రిమార్క్స్ రాసిన నెల్లూరు జైల్ సూపరింటెండెంట్. ఫలితంగా శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జులై 16వ తేదీన శ్రీకాంత్‌ పెరోల్‌ ఫైల్‌ను హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. అయినా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్‌కి పెరోల్‌ ఇస్తూ జీవో జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement