గోసంరక్షణకు విరాళాలు..
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తుల నుంచి గో సంరక్షణ నిమిత్తం విరాళాలను సేకరిస్తోంది. వీటితో అమ్మవారి సన్నిధిలో గోశాలను మరింత అభివృద్ధి చేయాల్సిన దేవస్థాన అధికారులు, తమ ఇష్టానుసారంగా గోవులను ఆలయానికి దూరంగా తరలించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ఆలయం దిగువ ప్రైవేటు వ్యక్తులు సొసైటీ పేరిట గోశాలను నిర్వహిస్తున్నప్పుడు దేవస్థానం గోశాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. దుర్గగుడికి 15 కిలోమీటర్ల దూరంలో గోవులను తరలించడం కంటే దేవస్థానానికి కూతవేటు దూరంలో నిరుపయోగంగా ఉన్న సీవీరెడ్డి చారిటీస్, ఏనుగుల షెడ్డును వినియోగంలోకి తీసువస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఆలయంలో ఉన్న గోవులను అమ్మవారికి అందనంత దూరంలో ఉంచాల్సి వచ్చిందో అధికారులు భక్తులు సమాధానం చెప్పాలంటున్నారు.


