హైటెక్ హంగులు..
కోడిపందేలు తిలకించేలా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, ఎల్‌ఈడీ స్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా, మంచు వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ రెయిన్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. కేసినోను తలదన్నేలా జూద క్రీడలు నిర్వహించేందుకు భారీ షెడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఏసీతో పాటు అన్ని హంగులు సమకూర్చుతున్నారు. వేల మంది కూర్చొని చూసేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతేక్యంగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బరుల్లో ఒక్కో విభాగం విభజించి, రేటు పెట్టి బయటి వ్యక్తులకు కేటాయిస్తున్నారు. జూద క్రీడలు, కోడిపందేలు, కేసినో, ఫుడ్, మందు, ఇలా స్టాల్స్‌గా విభజించి రేట్లు నిర్ణయించారు. ఈ బరుల నిర్వహణలో గంజాయి కేసుల్లో ఉన్న వారు ఉన్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు సాయంత్రం 6 గంటల వరకు సంప్రదాయబద్ధంగా పోటీలు నిర్వహించుకొంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డే అండ్ నైట్ జూద క్రీడలు, కోడిపందేలు వంటి వాటి వల్లే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటి నియంత్రణను పోలీసులు, రెవెన్యూ ఉన్నతాధికారులు ఏవిధంగా చేస్తారో వేచి చూడాల్సిందే.


