PM Modi Carries Mortal Remains Of Mother Heeraben Modi, Last Rites Begin - Sakshi
Sakshi News home page

Heeraben Modi: తల్లి హీరాబెన్‌ పాడె మోసిన ప్రధాని మోదీ

Dec 30 2022 8:39 AM | Updated on Dec 30 2022 10:30 AM

తల్లి హీరాబెన్‌ పాడె మోసిన ప్రధాని మోదీ - Sakshi

గాంధీనగర్: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మోదీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.

అనంతరం గాంధీనగర్‌లోని ముక్తిధామ్‌ శ్మశానవాటికిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ చితికి నిప్పంటించి అక్కడి నుంచి వెనుదిరిగారు మోదీ.  హిరాబెన్ అంతిమయాత్రకు కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అంతకుముందు గాంధీనగర్‌లోని నివాసంలో తన తల్లి పార్ధీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు మోదీ. కడసారి నివాళులు అర్పించారు.

ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారమైన హృదయంతో సందేశాన్ని రాసుకొచ్చారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement