ముంబైని ముంచెత్తుతున్న వాన.. విద్యాసంస్థలకు సెలవు | Heavy Rain In Mumbai maharashtra | Sakshi
Sakshi News home page

ముంబైని ముంచెత్తుతున్న వాన.. విద్యాసంస్థలకు సెలవు

Jul 25 2024 7:32 AM | Updated on Jul 25 2024 1:36 PM

Heavy Rain In Mumbai maharashtra

ముంబై: మహారాష్ట్ర,  గుజరాత్,  గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. గుజరాత్‌లోని సూరత్‌, వడోదరలో భారీ వర్షాలు కురుసున్నాయి.

పుణెను భారీ​ వర్షాలు ముంచేస్తున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి. కడ్‌క్‌ వాస్లా డ్యామ్‌కు వరద నీరు భారీగా పోటెత్తింది. దీంతో అధికారులు నీటిని కిందికి వదిలారు.  వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.  విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

బుధవారం థానే, పాల్ఘర్‌లలో భారీ వర్షం కురిసింది. భారీగా కురుస్తున్న వర్షాలకు భారత వాతావరణ శాఖ గురువారం థానే, రాయ్‌ఘడ్, పాల్ఘర్‌లకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో గురువారం మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు తెలిపారు. సెంట్రల్ మహారాష్ట్రలో అత్యంత భారీ విర్షం కురుస్తుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

 

ముంబైలో గడిచిన 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం థానే, కళ్యాణ్‌, పాల్ఘర్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. కళ్యాణ్, థానే, ములుంద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని  అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement