భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం | Ghaziabad Fire news 5 People Died | Sakshi
Sakshi News home page

భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

Published Thu, Jun 13 2024 11:24 AM | Last Updated on Thu, Jun 13 2024 11:24 AM

Ghaziabad Fire news 5 People Died

చిన్నపాటి నిప్పు పెను ‍ప్రమాదానికి దారితీస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లాంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఒక్కోసారి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఘజియాబాద్‌లో ఇలాంటి ఉదంతమే జరిగగా, ఐదుగురు సజీవ దహనమయ్యారు.

ఢిల్లీకి ఆనుకుని ఉన్న యూపీలోని ఘజియాబాద్‌ పరిధిలోని ఓ గ్రామంలో మూడంతస్తుల ఇంట్లో జరిగిన  అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఇంట్లో ఫోమ్ తయారీ పనులు జరుగుతుంటాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖకు చెందిన పలు వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే అంతకుముందే ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులంతా మంటల్లో చిక్కుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెహతా హాజీపూర్ గ్రామంలో ఇష్తియాక్ అలీకి మూడు అంతస్తుల ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఈ ఇంట్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను  అదుపు చేశారు. అనంతరం వారు ఇంటిలోనికి ప్రవేశించిగా అక్కడ వారికి ఐదు మృతదేహాలు కనిపించాయి.  మృతులలో ఫర్హీన్ (28), షీష్ (7 నెలలు), నజారా (30), సైఫుర్ రెహ్మాన్ (35), ఇఫ్రా (8)లు ఉన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బాధితులు టెర్రస్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారని, అయితే అది సాధ్యం కాలేదని స్థానికులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement