కేరళలో ఘోర అగ్ని ప్రమాదం..పలువురికి గాయాలు

Gas Cylinder Explodes in Kerala Few Injured - Sakshi

కేరళలోని ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపార సంస్థల్లోని సిలిండర్‌లు పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ అడ్నిమాపక సిబ్బంది, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని సివిల్‌స్టేషన్‌ సమీపంలోని వ్యాపార సంస్థల్లో శుక్రవారం హఠాత్తుగా సిలండర్‌ పేలుడంతో జరిగింది.

దీంతో సంఘటన ‍స్థలానికి సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. మంటలు మరింత వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న దుకాణంలోని గ్యాస్‌ సిలిండర్లు కూడా పేలాయి. దీంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్‌ ప్లగ్‌ నుంచి వైర్‌ ముక్క తలకు తగలడంతో మరోక వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది.

గాయపడ్డ బాధితులను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేగాదు మిగతా దుకాణాల్లోని గ్యాస్‌ సిలిండర్లు పేలకుండా వాటిని తక్షణమే తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనాస్థలికి మరిన్ని అగ్నిమాపక యంత్రాలు చేరుకుని త్వరిత గతిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఈ ప్రమాదం బారిని పడ్డారనేది తెలియాల్సి ఉంది. 

(చదవండి: ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top