breaking news
Kerala:
-
కేరళలో ఘోర అగ్ని ప్రమాదం..పలువురికి గాయాలు
కేరళలోని ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపార సంస్థల్లోని సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ అడ్నిమాపక సిబ్బంది, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని సివిల్‌స్టేషన్ సమీపంలోని వ్యాపార సంస్థల్లో శుక్రవారం హఠాత్తుగా సిలండర్ పేలుడంతో జరిగింది. దీంతో సంఘటన స్థలానికి సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. మంటలు మరింత వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న దుకాణంలోని గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దీంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ ప్లగ్ నుంచి వైర్ ముక్క తలకు తగలడంతో మరోక వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. గాయపడ్డ బాధితులను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేగాదు మిగతా దుకాణాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలకుండా వాటిని తక్షణమే తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనాస్థలికి మరిన్ని అగ్నిమాపక యంత్రాలు చేరుకుని త్వరిత గతిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఈ ప్రమాదం బారిని పడ్డారనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు) -
పాపులర్ హీరోయిన్, భర్త, మరిది అరెస్ట్
తిరువనంతపురం: చీటింగ్ కేసులో మలయాళ పాపులర్ నటి, హీరోయిన్, ఆమె భర్త, మరిదిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రి యల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడిన ఆరోపణలపై దక్షిణాది నటి ధన్య మేరీ వర్గీస్ (31)ఆమె భర్త జాన్ జాకబ్, జాకబ్ సోదరుడు శ్యామ్యల్ జాకబ్ లను శనివారం అరెస్ట్ చేశారు. 2014 నాటి కేసుకు సంబంధించిన వీరిని తాజాగా అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురం పరిసరాల్లో నిర్మిస్తున్న నోవా కాజిల్ ఫ్లాట్ కాంప్లెక్స్‌లో తమకు అపార్ట్మెంట్లు ఇప్పిస్తామని ధన్య భర్త జాన్ జాకబ్‌కు చెందిన సంస్థ శాంసన్ అండ్ సన్స్ ద్వారా కోట్లాది రూపాయలూ కాజేశారని అందిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు. 2011 లో శాంసన్ అండ్ సన్స్ సంస్థ తరపున కలిసి బాధితుల భారీ ఎత్తున సొమ్మును తీసుకొని ప్లాట్ లు కేటాయించకుండా మోసానికి పాల్పడ్డారు. ఒకొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ మొత్తం 100 కోట్ల రూపాయల మేర వసూళ్ళు చేసిన ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ధన్య మామ జాకబ్ శాంసన్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా 31 సంవత్సరాల ధన్య తమిళ సినిమా 'తిరుడి' (దొంగ) చిత్రం ద్వారా 2006లో సినీ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత మలయాళ రంగంలోకి అడుగుపెట్టారు. టీవీ సీరియళ్ళలో కూడా దర్శనమిచ్చిన నర్గీస్ తలప్పావు సినిమాకు ఆమె ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. దీంతోపాటుగా మళయాంలో కేరళ కేఫ్, నాయగన్ సినిమాల్లో కూడా నటించారు. జాన్ కూడా పలు సినిమాల్లో నటించార. 2012లో వివాహం చేసుకున్న ధన్య, జాన్ జంటకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.