జేపీ నడ్డాతో వివేక్‌ భేటీ | Gaddam Vivekanand Meets JP Nadda | Sakshi
Sakshi News home page

జేపీ నడ్డాతో వివేక్‌ భేటీ

Sep 19 2020 3:59 AM | Updated on Sep 19 2020 3:59 AM

Gaddam Vivekanand Meets JP Nadda - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు గడ్డం వివేకానంద శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని తాజా రాజకీ యాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ చేపడుతున్న పలు కార్యక్రమాలను నడ్డాకు వివరించాను. సీఎం చేస్తున్న అవినీతిని వివరించాను. అన్ని ప్రాజెక్టుల్లో సీఎం కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వంపైన కేసీఆర్‌ తప్పుడు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అంటే ఆయనకు భయం పుడుతోంది. రాష్ట్రంలో బండి సంజయ్‌ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంగా అయిందని వివరించాను. రాబోయే మున్సిపల్‌ ఎన్నికలపై జేపీ నడ్డాతో చర్చించాను..’ అని తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement