
సాక్షి, న్యూఢిల్లీ: డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ జి.సతీశ్ రెడ్డిని జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ‘జాతీయ భద్రతా సలహా మండలి’లో సభ్యుడిగా మంగళవారం నుంచి రెండేళ్ల పాటు, అంటే 2027 జూన్ 9వ తేదీ వరకు సతీశ్‌రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయ డిప్యూటీ సెక్రటరీ పుష్పేందర్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని మహిమలూరులో 1963 జూలై 1న జన్మించిన సతీశ్ రెడ్డి 1986లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో అనంతపురం జేఎన్‌టీయూ నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు.పరిశోధనా సంస్థ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ కాలంలో ఐఆర్ సీకర్స్, ఇంటిగ్రేటెడ్ ఏవి యానిక్స్ మాడ్యూల్స్, ఇతర వినూత్న వ్యవస్థల అభి వృద్ధిని పర్య వేక్షించారు. 2015 లో రక్షణ మంత్రి సాంకేతిక సలహా దా రుగా నియమి తులయ్యారు.
2018 ఆగస్టు లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల ప్‌మెంట్ ఆర్గనై జేషన్ (డీఆర్ డీవో) 13వ చైర్మన్‌గా నియమితులయ్యారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల అభివృద్ధి డైరెక్టర్ జనరల్‌గా ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించారు. నాగ్, క్యూఆర్‌ఎస్‌ఏఎం, రుద్రమ్, దీర్ఘశ్రేణి గైడెడ్ బాంబ్‌ల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. విజయవంతమైన పృథ్వీ డిఫెన్స్ వెహికిల్ తొలి పరీక్షను పర్యవేక్షించారు. 2018 నుంచి 2022 డీఆర్‌డీవో చైర్మన్‌గా సేవలందించారు.