ఏడాదికి పైగా జైలు శిక్ష అనంతరం.. మహారా ష్ట్ర మాజీ మంత్రికి ఊరట

Former Minister Anil Deshmukh Released From Arthur Road Jail - Sakshi

ఏడాదికిపైగా జైలు శిక్ష అనుభవించిన మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కి భారీ ఊరట లభించింది. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన ఆయనకు  పార్టీ నాయకులు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ఏడాదికిపైగా జైలు శిక్ష అనుభవించి ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలు నుంచి బుధవారంమే విడుదలయ్యారు. దేశ్‌ముఖ​ కోసం జైలు వెలుపల పలువురు నాయకులు పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. దేశ్‌ముఖ్‌ నాయక్‌ తన మద్దతుదారులు, పార్టీ ఎంపీ శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియాతో  కలసి టాప్‌ లెస్‌ జీపులో సిద్ధి వినాయాకుని ఆలయానికి బయల్దేరారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.."సస్పెండ్‌ అయ్యిన అధికారి సచిన్‌ వాజ్‌ కోరిక మేరకు తనను ఏడాదికిపైగా జైలులో ఉంచారని అన్నారు. తాను ఏ నేరం చేయకుండానే జైలులో ఉన్నానని చెప్పారు.  చివరకు కోర్టు నుంచి నాకు న్యాయం జరిగింది. దేశంలో కొత్త పరిపాలనపై నాకు నమ్మకం ఉంది. అలాగే రాజ్యంగంపై కూడా నమ్మకం ఉంది అని" అన్నారు. కాగా దేశ్‌ముఖ్‌ను మొదట మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు అయ్యారు ఆ తర్వాత బెయిల​పై నవంబర్‌ వరకు బయట ఉన్నారు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నవంబర్‌ 2021లో అరెస్టు చేసింది. అంతేగాదు దేశ్‌ముఖ్‌​ రాష్ట్ర హోంమంత్రి పదవిని దుర్వినియోగం చేశారని, కొంతమంది పోలీసు అధికారుల ద్వారా ముంబైలో వివిధ బార్‌ల నుంచి రూ. 4.7 కోట్లు వసూలు చేశారని సీబీఐ అవినీతి కేసు దాఖలు చేయడంతో ఆయన జైల్లో ఉన్నాడు.

ఐతే దేశ్‌ముక్‌కి బొంబాయి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి సమయం కోరడంతో న్యాయమూర్తి 10 రోజుల పాటు ఆర్డర్‌ని స్థభింపజేశారు. దీంతో సీబీఐ అత్యున్నత న్యాయస్తానంలో అప్పీలు చేసింది. కానీ శీతాకాలం సెలవుల కారణంగా జనవరిలో అప్పీలును విచారించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా దేశ్‌ముఖ్ వైద్యపరమైన కారణాలతో పాటు లొసుగులను పేర్కొంటూ బెయిల్ కోసం అప్పీల్ చేశారు. అంతేగాదు హైకోర్టు  సస్సెండ్‌ చేసిన పోలీసు అధికారి సచిన్ వాజ్ వాంగ్మూలం మినహా, బార్ యజమానుల నుంచి డబ్బు వసూలు చేశారని చెప్పడాని సీబీఐ వద్ద మరే ఆధారం లేదని హైకోర్టు పేర్కొంటూ దేశ్‌ముఖ్‌కి బెయిల్‌ మంజూరు చేసింది. 

(చదవండి: తుపాకీని లోడ్‌ చేయలేక హైరానా పడ్డ పోలీసు: కంగుతిన్న అధికారి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top